Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

PDS : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత..!

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా ఉదంతం వెలుగు చూసింది. శనివారం ఉదయం ఎరడ్లగూడెం గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

PDS : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత..!

గుర్రంపోడు, మన సాక్షి:

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా ఉదంతం వెలుగు చూసింది. శనివారం ఉదయం ఎరడ్లగూడెం గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం ఉదయం 09:30 గంటల సమయంలో ఎరడ్లగూడెం గ్రామ శివారులో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా టీఎస్ 05 యూసి 8447 నంబర్ గల ఆటోను ఆపి తనిఖీ చేయగా, అందులో అక్రమంగా తరలిస్తున్న 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం లభ్యమైంది.

మొత్తం 25 తెల్లటి సంచులలో ఈ బియ్యాన్ని నింపి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.అక్రమ రవాణాకు పాల్పడుతున్న కామంచి శివకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుర్రంపోడు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని, ఆటోను స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే సహించేది లేదని,అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్సై వెంకన్న హెచ్చరించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు