TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుసినిమాహైదరాబాద్

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ.. కంటెస్టెంట్స్ వీళ్లే..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ.. కంటెస్టెంట్స్ వీళ్లే..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఇప్పటివరకు కూడా సాదా సీదాగా సాగుతోంది. ప్రేక్షకులను ఏమాత్రం అలరించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రతి సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి 20 మంది కంటెస్టెంట్స్ ను పంపించారు. కానీ 8 సీజన్ లో మాత్రం కేవలం 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే పంపించారు.

ప్రస్తుతం నడుస్తున్న సీజన్ మినీ సీజన్ అనుకుంటున్నారా..? అలాంటిదేమీ లేదు. అయినా కూడా కేవలం 14 మందితోనే సారి పుచ్చుతారా..? ఇది ప్రేక్షకుల్లో ప్రశ్న. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీ తో మరి కొంతమందిని పంపొచ్చు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈవారం ట్విస్ట్ లతో ఉంటుందని నాగార్జున ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ట్విస్టులు లేకుండా సాదాసీదాగా బిగ్ బాస్ సాగుతుంది.

వచ్చేవారం వైల్డ్ కార్డు ఎంట్రీ తో ఆరు మంది కంటెస్టెంట్లను తీసుకురానున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 21వ తేదీన వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా 6 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలిసింది.

వారిలో సీజన్ 4 కంటెస్టెంట్ అవినాష్ మళ్లీ ఈ సీజన్ లో అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం. సీజన్ 4 లో కూడా అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీ తోని అడుగు పెట్టారు. ఈసారి కూడా అదే విధంగా హౌస్ లోకి పంపాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ సీజన్ ఏమాత్రం కామెడీ లేకుండా సాగుతున్నందున అవినాష్ ను మరోసారి పంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

అదేవిధంగా గత సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ తో వెళ్లి వారం రోజుల్లోనే ఎలిమినేట్ అయిన నయని పావని ఈసారి వైల్డ్ కార్డు ఎంట్రీ తో వెళ్ళనున్నట్లు సమాచారం. గత సీజన్ లో ఈమె ఎలిమినేషన్ విషయంలో అన్యాయం జరిగినది భావించడం వల్ల మరోసారి పంపే అవకాశాలు ఉన్నాయి.

మూడవ కంటెస్టెంట్ గా అంజలి పవన్ ఈమె బిగ్ బాస్ సీజన్ ప్రారంభం నుంచే రావాల్సి ఉండగా టీం రిక్వెస్ట్ చేయడంతో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రాబోతున్నట్లు సమాచారం. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఉన్న విష్ణు ప్రియ ప్రాణ స్నేహితురాలు అయిన రీతూ చౌదరి కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ తో హౌస్ లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఆమెతో పాటు గుప్పెడంత మనసుతో జగతి పాత్ర ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన జ్యోతిరాయి, మరో ఫిమేల్ మోడల్ కూడా హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రాబోతున్నారని సమాచారం. వీరిలో ఎవరైనా మిస్ అయితే సీజన్ 3 కంటెస్టెంట్ రోహిణి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

LATEST UPDATE : 

Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 6000 ఉద్యోగాలు భర్తీ..!

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. మాఫీ ఎప్పుడంటే, మంత్రి తుమ్మల స్పష్టం..!

Rythu Barosa : రైతులకు శుభవార్త, రైతు భరోసాపై క్లారిటీ.. వారికి మాత్రమే, మంత్రి తుమ్మల కీలక ప్రకటన..!

 Nalgonda : ప్రజాపాలన దినోత్సవం ఎప్పుడో తెలుసా.. జిల్లా కలెక్టర్ ప్రశ్నకు విద్యార్థుల సమాధానం..!

మరిన్ని వార్తలు