తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయంహైదరాబాద్

KTR : అసమర్ధుడి జీవనయాత్ర.. రేవంత్ పై కేటీఆర్ ఫైర్..!

KTR : అసమర్ధుడి జీవనయాత్ర.. రేవంత్ పై కేటీఆర్ ఫైర్..!

హైదరాబాద్, మన సాక్షి :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన ఆయన పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

తొమ్మిదిన్నర నెలలుగా అసమర్థుడి జీవన యాత్ర లాగా రేవంత్ ప్రభుత్వం సాగుతుందన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండని విమర్శించారు.

హామీలు అమలు చేయమని గట్టిగా అడిగినందుకు ఎమ్మెల్యేల మీద కూడా దాడులు చేస్తున్నారన్నారు. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీలో హైకోర్టు తీర్పు వల్ల భయం మొదలైంది అన్నారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పై డిస్ క్వాలిఫై పిటిషన్ వేసింది కౌశిక్ రెడ్డి అని పేర్కొన్నారు.

గతంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి, వాళ్ళ ఇంటిముందు చావు డబ్బులు కొట్టండి అని మాట్లాడిందే రేవంత్ రెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పు వచ్చిన రోజే అరికెపూడి గాంధీని పిఎసి చైర్మన్ గా నియమిస్తూ ప్రకటన చేశారని పేర్కొన్నారు.

ఇలాంటి గుండా గిరి పదేళ్లలో ఎప్పుడు చూడలేదని ఫ్యాక్షన్ సినిమాలు తలపించేలా ఉన్నాయన్నారు. చేతకాని సీఎం వాళ్ళని ఇదంతా జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకొని కండువాలు కప్పుతున్నారని విమర్శించారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పటికైనా ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలన్నారు. నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రిలను ఎంతోమందిని చూశామని నువ్వు ఒక బుల్లబ్బాయి అని రేవంత్ రెడ్డిని ఘాటుగా విమర్శించారు. నిన్న మమ్ములను హౌస్ అరెస్ట్ చేసి గాంధీకి రక్షణ కల్పించారని విమర్శించారు. గాంధీని హౌస్ అరెస్ట్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగేవి కావన్నారు.

హైదరాబాదులో పదేళ్లు శాంతిభద్రతలు అద్భుతంగా ఉండేవని, హైదరాబాదులో ఉన్న ప్రజలంతా మా వారే అని, ప్రాంతీయతత్వం మీద దాడులు గతంలో లేవన్నారు. ఇప్పుడు కూడా ఉండవని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ ప్రజలు అండగా నిలిచారని రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరినవ్ దిక్కుమాలిన పీఏసీ పదవి కోసం ఇలాంటి మాటలు మాట్లాడిన గాంధీకి సిగ్గుండాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక్కసారి నియోజకవర్గ ప్రజలను అడిగితే గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో చెబుతారని ఆయన పేర్కొన్నారు.

LATEST UPDATE : 

Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 6000 ఉద్యోగాలు భర్తీ..!

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. మాఫీ ఎప్పుడంటే, మంత్రి తుమ్మల స్పష్టం..!

Rythu Barosa : రైతులకు శుభవార్త, రైతు భరోసాపై క్లారిటీ.. వారికి మాత్రమే, మంత్రి తుమ్మల కీలక ప్రకటన..!

TG News : తెలంగాణలో రెండో రోజు రాజకీయ రచ్చ.. నేతల మధ్య మాటల యుద్ధం..!

మరిన్ని వార్తలు