తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Komatireddy : రూ. 2000 కోట్లతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి ఆరు లైన్లుగా విస్తరణ..!

Komatireddy : రూ. 2000 కోట్లతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి ఆరు లైన్లుగా విస్తరణ..!

నల్లగొండ, మనసాక్షి :

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించినట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి పేర్కొన్నారు. నల్గొండలో గణేష్ శోభాయాత్రను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లాను రాష్ట్రంలోనే మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తున్నానని అన్నారు.

ముఖ్యంగా 2000 కోట్ల రూపాయలతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణ పనులకు త్వరలోనే కేంద్ర మంత్రి గడ్కరితో శంకుస్థాపన చేయించనున్నామని, 450 కోట్ల రూపాయలతో నల్గొండ పట్టణంలో రోడ్లు, డ్రైన్ల వంటి పనులు జరుగుతున్నాయని అన్నారు.

పది లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 10 తాగు నీటి ట్యాంకులు, 15 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 5 తాగునీటి ట్యాంకులు స్లాబ్ దశకు చేరుకున్నాయని, త్వరలోనే పనులు పూర్తయితాయని చెప్పారు.
2 సంవత్సరాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు, సిసి రోడ్లను పూర్తి చేస్తామన్నారు.

పేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకుగాను హౌసింగ్ బోర్డ్ కి చెందిన 50 ఎకరాల స్థలాన్ని సేకరించడం జరిగిందని, మరో 25 ఎకరాలలో 80 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పనులు త్వరలోనే ప్రారంభించనున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

LATEST UPDATE :

Rythu Barosa : 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయం.. రైతు భరోసా ప్రారంభం అప్పుడే..!

సెప్టెంబర్ 17న ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనబోతుందా.. కలవర పడుతున్న మానవాళి..!

Cm Revanth : రుణమాఫీ పై సీఎం రేవంత్ సంచలన ప్రకటన..!

Nelakondapally : రైతులకు రూ.10వేల సహాయం.. మంత్రి పొంగులేటి వెల్లడి..!

మరిన్ని వార్తలు