తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ

District collector : విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి.. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి..!

District collector : విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి.. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి..!

నల్లగొండ, మన సాక్షి :

జిల్లాలోని అన్ని కేజీబీవీలు, మోడల్ పాఠశాలలో విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలను వారం రోజులలో పూర్తి చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోషణ అభియాన్ పై మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ సూపర్వైజర్లు, సిడిపిఓలు, అంగన్ వాడి టీచర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

సిడిపిఓలు, వైద్యాధికారులు ఆర్ బిఎస్ కే కింద అన్ని కేజీబీవీలు, మోడల్ పాఠశాలల్లో విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించాలని అన్నారు. అలాగే అంగన్వాడి టీచర్లు పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లలు, వయసుకు తగ్గ బరువు లేమితో బాధపడుతున్న పిల్లలను గుర్తించాలని, అనంతరం వారికి సరైన పౌష్టికాహారం అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని, ఈ విషయంలో తల్లిదండ్రులకు సైతం అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లాలోని నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి తో పాటు, దేవరకద్ర, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ప్రభుత్వాసుపత్రులలో 24 గంటలు ప్రసవాలు జరిగే విధంగా ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించడం జరిగిందని, అందువలన అంగన్వాడీ టీచర్లు ఈ విషయంలో వైద్య ఆరోగ్యశాఖకు పూర్తి సహకారం అందించాలని అన్నారు. అనంతరం అంగన్వాడి టీచర్లు నిర్వహించే బి ఎల్ ఓ విధులు, తదిత అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, జిల్లా సంక్షేమ అధికారి సక్కుబాయి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ ఇన్చార్జి అధికారి రాజ్ కుమార్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్, డిపి ఓ మురళి, మెప్మా పీడీ కరుణాకర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

LATEST UPDATE : 

Rythu Bharosa : పంట పండించే రైతులకే రైతు భరోసా.. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు..!

Rythu Bharosa : రైతులకు అదిరే శుభవార్త.. ఎకరానికి 15000, రైతు భరోసా డేట్ ఫిక్స్..!

దసరా సెలవుల డేట్స్ ఇవే.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

Suryapet : సూర్యాపేట జిల్లాకు గోదావరి జలాలు..!

మరిన్ని వార్తలు