District collector : ఓటరు ఇంటిని సందర్శించిన జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలిస్తే షాక్..!
District collector : ఓటరు ఇంటిని సందర్శించిన జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలిస్తే షాక్..!
జగిత్యాల, (మాన సాక్షి)
జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో ఓటర్ గుర్తింపు కార్డు తొలగించినట్లు బాధితుడు కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా, శనివారం జిల్లాలో నిర్వహించిన పర్యటనలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ బాధితుని ఇంటికి వెళ్లి పరిశీలించారు.
మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో ఓటర్ జాబితాలో బింగి నవీన్ అనే వ్యక్తి పేరు తొలగించినందుకు గాను అతను ఫిర్యాదు చేసుకోగా జిల్లా కలెక్టర్ ఆ గ్రామాన్ని సందర్శించి తొలగించి ఓటరు ఇంటికి వెళ్లి స్వయంగా వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం అక్కడ అధికారులతో మాట్లాడి తొలగింపునకు జరిగిన సాంకేతిక కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో మాట్లాడగా వారు గ్రామంలో ఇద్దరి పేర్లు ఒకే విధంగా ఉండటం వల్ల ఇటువంటి సమస్య వచ్చింది తెలిపారు. బి ఎల్ ఓ, మాట్లాడి మళ్లీ గ్రామ ఓటరు జాబితాలో నమోదు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
అలాగే దాంరాజ్ పల్లి గ్రామంలో ఏడవ వార్డులోని నివసిస్తున్న ఇంటి నెంబర్ ని వేరేవాడలో బదిలీ చేసినందుకు గాను వారు ఫిర్యాదు చేసుకోగా, జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లి పరిశీలించి జిల్లా డిపిఓ అధికారి తో మాట్లాడి వారి ఇంటిని యధావిధిగా ఏడో వార్డులు నమోదు చేయాలని గ్రామపంచాయతీ సెక్రటరీ ఆదేశాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ఆర్డిఓ శ్రీనివాస్ , డిపిఓ రఘువరన్, ఎమ్మార్వో వీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
District collector : మంథని బిల్ కలెక్టర్ సస్పెన్షన్.. ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్..!
Jani Master : చంచల్ గూడ జైలుకు జానీ మాస్టర్.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్..!
Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు డేట్ ఫిక్స్.. అర్హులు వీరే..!
Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు డేట్ ఫిక్స్.. అర్హులు వీరే..!









