Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : ఆకస్మికంగా హాస్టల్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే.. సిబ్బందిపై ఆగ్రహం..!

Miryalaguda : ఆకస్మికంగా హాస్టల్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే.. సిబ్బందిపై ఆగ్రహం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సౌకర్యాలు, భోజనాల ఏర్పాట్లపై విద్యార్థులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విద్యార్థుల బోజనాలను పరిశీలించారు.
అనంతరం మెనూ అడిగి తెలుసుకున్నారు. ఆహారంలో నాణ్యత లేకపోవడంతో వార్డెన్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్టోరూం లో ఉన్న కూరగాయలు నాణ్యత లేకపోవడంతో కాంట్రాక్టర్ కి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

హాస్టల్లో భోజనాలు సక్రమంగా లేకపోవడంపై అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. హాస్టల్ వార్డెన్, సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తనకు నేరుగా ఫోన్ చేయాలని ఫోన్ నెంబర్ ఇచ్చారు.

LATEST UPDATE : 

BIG BREAKING : బాలికలతో తప్పుగా ప్రవర్తన.. ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్..!

హైదరాబాదులో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిన ట్రాఫిక్..!

iphone 16 : ఫ్లిప్ లో ఐఫోన్ 16, రూ.55 వేల లోపే.. అంత తక్కువ ఎలాగో చూడండి..!

District collector : ఓటరు ఇంటిని సందర్శించిన జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలిస్తే షాక్..! 

మరిన్ని వార్తలు