తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా

Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. ఈనెల 28న పోస్టుల భర్తీకై ఇంటర్వ్యూ..!

Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. ఈనెల 28న పోస్టుల భర్తీకై ఇంటర్వ్యూ..!

పెద్దపల్లి, ధర్మారం,  మన సాక్షి ప్రతినిధి:

తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రిలో యోగా బోధకుల పోస్టుల భర్తీలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 90 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పెద్దపల్లి ఆయుష్ శాఖ జిల్లా ఇంచార్జ్ డాక్టర్ అరుణ,పెద్దపల్లి డిపిఎం విద్య సాగర్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 842 యోగ బోధకుల పోస్టులను భర్తీ చేయనుండగా అందులో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో 90 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వారు చెప్పారు. కరీంనగర్లో 15 మంది పురుష అభ్యర్థులు 15 మంది స్త్రీలు ,పెద్దపల్లి జిల్లాలో లో 10 మంది పురుషులు 10 మంది స్త్రీలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8 మంది పురుషులు 8 మంది స్త్రీలు జగిత్యాల జిల్లాలో 12 మంది పురుషులు 12 మంది స్త్రీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

పురుష బోధకులు నెలకు కనీసం 32 యోగా తరగతులను, స్త్రీ బోధకులు కనీసం 20 యోగా తరగతులకు హాజరు కావాలన్నారు.పురుష యోగ బోధకులకు ఒక తరగతికి 250 చొప్పున 8వేల రూపాయలు స్త్రీ యోగా బోధకులకు 5 వేలు పారితోషకం ఉంటుందన్నారు. ఈ పోస్టుల భర్తీకై ఇంటర్వ్యూను కరీంనగర్ రామనగర్ లోని ఆయుష్ ఆయుర్వేద ఆసుపత్రిలో ఈనెల 28 శనివారం ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ పోస్టులకు కనీస అర్హత పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ తో పాటు మినిమం ఆరు నెలల యోగా సర్టిఫికెట్ ఉండాలని, అభ్యర్థులు 45 సంవత్సరంలోపు ఉండి యోగా నైపుణ్యాన్ని కలిగి ఉండాలని వారు చెప్పారు. ఈ యోగా బోధకుల పోస్టులు పార్ట్ టైం విధానంలో భర్తీ చేయనున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి :

మరిన్ని వార్తలు