Suryapet : కొడుకు ప్రభుత్వ ఉద్యోగి… కానీ అన్నం పెట్టడంలేదు, జిల్లా కలెక్టర్ ముందు ఓ తల్లి ఆవేదన..!
Suryapet : కొడుకు ప్రభుత్వ ఉద్యోగి… కానీ అన్నం పెట్టడంలేదు, జిల్లా కలెక్టర్ ముందు ఓ తల్లి ఆవేదన..!
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా కేంద్రంలో కన్నతల్లికి అన్నం పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం అందరిని కలిచి వేసింది. సూర్యాపేటకు చెందిన వల్దాస్ లింగమ్మకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త రాములు నాలుగేళ్ల క్రితం మృతి చెందడంతో చిన్న కుమారుడు అయన ప్రవీణ్ వద్ద ఉంటుంది..
తల్లి యొక్క యోగక్షేమాలు నిరుద్యోగి అయిన చిన్న కొడుకే చూసుకుంటున్నాడు. పెద్ద కుమారుడు అయిన నాగేందర్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తు కూడా కన్న తల్లిని మాత్రం పట్టించుకోకపోవడంతో అన్నం కూడా పెట్టడం లేదని కన్నీటి పర్వతం అయింది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ కు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ… తన చిన్న కొడుకు అయిన ప్రవీణ్ తన యోగక్షేమాలు చూసుకుంటున్నాడని పెద్ద కుమారుడు ప్రభుత్వ ఉద్యోగ పని చేస్తూ.. తను అనారోగ్యానికి గురైన ఏమాత్రం పట్టించుకోకుండా.. మానసిక వేదనకు గురి చేస్తున్నాడని కన్నీటి పర్వతం అయింది.
తన కోడలు అసభ్య పదజాలంతో దూషిస్తుందని.. అవసరమైతే అనాధశ్రయంలో వదిలేస్తా అంటూ చంపుతామని బెదిరింపులకి గురి చేస్తున్నారని భావోద్వేగానికి గురైంది ఆ కన్న తల్లి…
తనకున్న 360 గజాల ఇంటి స్థలంలో మాయమాటలు చెప్పి పది సంవత్సరాల క్రితమే 180 గజాలు సుమారు రూ. 30 లక్షల విలువ చేసే ఇంటి స్థలాన్ని తన చేత రిజిస్ట్రేషన్ చేయించుకొని సొంత ఇంటి నిర్మించుకున్నాడని ఆ తల్లి మనోవేదన కలిచివేసింది.
తన పెద్ద కొడుకు నాగేందర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కలెక్టర్ ముందు తన గోడు వెళ్ళబోసుకుంది ఆ కన్న తల్లి.
LATEST UPDATE :









