NALGONDA : నల్గొండ జిల్లాలో ఎంపీడీవో, ఇద్దరు కార్యదర్శుల సస్పెన్షన్..!
NALGONDA : నల్గొండ జిల్లాలో ఎంపీడీవో, ఇద్దరు కార్యదర్శుల సస్పెన్షన్..!
నల్లగొండ, మన సాక్షి :
గ్రామపంచాయతీలకు గడ్డి కోత యంత్రాలను కొనుగోలు చేయకపోవడం, మొక్కల పెంపకం, పారిశుద్ధ్యం, కంపోస్ట్ షెడ్ నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వంటి కారణాల తో గుర్రంపోడు ఎంపీడీవో పి. మంజుల ను అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడం, పారిశుధ్యం, ఇతర కారణాలపై పెద్దవూర మండలం, పులిచెర్ల గ్రామపంచాయతీ కార్యదర్శి కే . నాగరాజు ను పారిశుద్ధ్యం, క్రిమటోరియం నిర్వహణ పట్ల నిర్లక్ష్యం కారణంగా దామరచర్ల మండలం వాచ్య తాండ జూనియర్ గ్రామపంచాయతీ కార్యదర్శి కె.స్వప్నను సస్పెండ్ చేసి నట్టు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు.
పారిశుధ్య కార్యక్రమాలలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలకు గడ్డి కోత యంత్రాలను కొనుగోలు చేయాలని ఆదేశించినప్పటికీ 37 గ్రామపంచాయతీలకు గాను కేవలం 10 గ్రామపంచాయతీలకు మాత్రమే గడ్డి కోత యంత్రాలను కొనుగోలు చేసి 27 గ్రామపంచాయతీలకు కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహించడం, అలాగే మొక్కల పెంపకం, కంపోస్ట్ షెడ్, పారిశుద్ధ్య కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించకపోవడం వంటి కారణాలవల్ల నల్గొండ జిల్లా, గుర్రంపోడు మండల ఎంపీడీవో మంజులను జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సస్పెండ్ చేశారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మండల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో వివిధ అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా గుర్రంపోడు మండలంలో పారిశుధ్య కార్యక్రమాలపై సమీక్ష సందర్బంగా నిర్లక్ష్యం పై గుర్రంపోడు ఎంపీడీవోను సస్పెండ్ చేశరు. అలాగే పెద్దవూర మండలం, పులిచర్ల గ్రామ ఔట్సోర్సింగ్ గ్రామపంచాయతీ కార్యదర్శి కే. నాగరాజు మంగళవారం అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడం, మండల ప్రత్యేక అధికారి గ్రామ సందర్శనలో అందుబాటులో లేకపోవడం, గ్రామంలో పారిశుధ్యం, చెత్త సేకరణ, ప్లాంటేషన్ తదితర విషయాలపట్ల నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లు తెలిపారు.
అంతేకాక దామరచర్ల మండలం, వాచ్య తాండ జూనియర్ గ్రామపంచాయతీ కార్యదర్శి కే.స్వప్న పారిశుద్యం , మొక్కల పెంపకం తదితర వాటిపట్ల నిర్లక్ష్యం కారణంగా విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. పారిశుధ్య నిర్వహణ, సీజనల్ వ్యాధులు ,మొక్కల పెంపకం, తదితర అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పదేపదే చెప్పడం తో పాటు, రాతపూర్వకంగా ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ నిర్లక్ష్యం వహించడం జరిగిందని ,విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
పారిశుధ్య లోపం కారణంగా సీజనల్ వ్యాధులు ప్రభలెందుకు అవకాశం ఉందని, ముఖ్యంగా డెంగ్యూ, చికెన్ గున్య, మలేరియా వంటి జ్వరాలు సోకేందుకు ఆస్కారం ఉందని, దోమల వల్ల ఈ వ్యాధులన్నీ వస్తాయని, దోమలు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు.
ప్రత్యేకించి దోమల నివారణకు పాగింగ్ తో పాటు, గ్రామాలలో ముళ్లఫోదలు పిచ్చి మొక్కలు తొలగించేందుకు తప్పనిసరిగా ప్రతి గ్రామపంచాయతీకి గడ్డి కోత యంత్రాలను కొనుగోలు చేయాలని, నీరు నిల్వ ఉండే చోట ఆయిల్ బాల్స్ ను వేయాలని, మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆయన మరోసారి తెలిపారు.
మండల ప్రత్యేక అధికారులు గ్రామాలు సందర్శించినప్పుడు తప్పనిసరిగా గ్రామంలో శానిటేషన్ తో పాటు, అంగన్వాడి ,పాఠశాలలు అన్నింటిని పరిశీలించాలని, వనమహోత్సవం కింద పెంచిన మొక్కలు వీటన్నిటిని తనిఖీచేయాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర ,మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ , మండలాల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, అధికారులు ,ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.
LATEST UPDATE :









