Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణసినిమా

Bigg Boss 8 Telugu : సోనియాకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. షాకింగ్

Bigg Boss 8 Telugu : సోనియాకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. షాకింగ్..!

మన సాక్షి, సినిమా:
నాలుగు వారాలపాటు బిగ్ బాస్ 8లో కొనసాగిన సోనియా ఆదివారం ఎలిమినేషన్ అయిన విషయం తెలిసిందే. నాలుగు వారాలపాటు బిగ్‌బాస్ 8 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. కానీ సోనియాకు నాగార్జున ఊహించని షాక్ ఇచ్చారు.

చివరి వరకు ఉంటాననుకున్న సోనియా నాలుగు వారాలకే ఇంటికి చేరుకుంది. బిగ్‌బాస్ ఇంటిలో సోనియా చేసిన కొన్ని విషయాలు ప్రేక్షకులకు నచ్చలేదువ దాంతో ఆమెకు నాగార్జున షాక్ ఇచ్చి బిగ్ బాస్ ఇంటి నుంచి సొంత ఇంటికి పంపించాడు.

సోనియా అతివిశ్వాసం ప్రదర్శించడంతో పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారందరినీ తక్కువ అంచనా వేసి ఇంటికి పంపించాలని ప్లాన్ చేసింది. అది కాస్త తిరగబడింది. ఎంతో మందిని ఇంటికి పంపాలని భావించింది. కానీ పాపం ఆమెనే వెళ్ళిపోవాల్సి వచ్చింది.

ఈ సీజన్ లో కెప్టెన్సీ ఉండరని దానికి బదులు చీప్స్ ఉంటారని బిగ్ బాస్ ముందే చెప్పాడు. కానీ షో మొదలైన రెండు రోజుల్లోనే సత్తా తెలుసుకోవడం కష్టం కాబట్టి నిఖిల్ తన ఫ్రెండ్ యశ్విని చీఫ్ గా సెలెక్ట్ చేశాడు. అందుకు సోనియా పెద్ద రాద్ధాంతం చేసింది.

నిఖిల్ తో మితిమీరిన హగ్గులు, అతడిని అభ్యంతరకరంగా టచ్ చేయడం చూసి ప్రేక్షకులు సోనియాను చీదరించుకున్నారు. నిఖిల్, పృద్విని ఆమె గుప్పిట్లో పెట్టుకుని వెంట తిప్పుకున్నారని ప్రేక్షకులు భావించారు. ఆమె తన గేమ్ ఆడక పోవడంతో పాటు నిఖిల్, పృథ్విలను కూడా చెడగొట్టి గేమ్ ఆడనివ్వలేదు.

యశ్విని, నిఖిల్, పృద్విని చూస్తే ఎలా అని సెటైర్లు వేసిన ఈమె మరి ఎంతసేపు ఆ ఇద్దరి వెంట తిరుగుతూ ఉండేది. ఆమె కొంచమైనా ఆలోచించకపోవడం, టాస్కుల్లో ఆడక పోవడం, ఇదంతా ప్రేక్షకులు గమనించారు.

ఆమె ఆడపులి అనే ట్యాగ్ కేవలం హౌస్ లో ఉన్న వారందరిపై నోరు చేసుకోవడం తప్ప దానికి న్యాయం చేయలేదు. అయితే ఆమె నాలుగో వారానికే బయటికి రావడం ఆమెకు పారితోషకం కేవలం ఆరు లక్షల రూపాయలు మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తుంది.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు