Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : గాలి వాన బీభత్సం.. నేల వాలిన వరి పంట..!

Suryapet : గాలి వాన బీభత్సం.. నేల వాలిన వరి పంట..!

అనంతగిరి, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో నిన్న రాత్రి కురిసిన వర్షం వల్ల గాలుల బీభత్సానికి విద్యుత్ స్తంభాలు కూడా చాలా చోట్ల నేలకి ఒరిగాయి. అంతేగాక మండలంలోని రోడ్డు ఇరుపక్కలా ఉన్న చెట్లు ఈదురు గాలులు వీచేసరికి రహదారికి ఆటంకంగా మారాయి.

మండలంలోని కొన్ని ప్రాంతాలలో తీగలు వేలాడుతున్న అధికారులు, లైన్మెన్లు పట్టించుకోకపోవడం వల్ల ఆ దారి గుండా వెళ్ళే ప్రయాణికులకు భయాందోళన కలిగిస్తున్నాయి.ఈ సంఘటనలన్నీ త్రిపురవరం, వాయల సింగారం, వసంతపురం, ఖానపురం, అమీనాబాద్ వంటి చాలా గ్రామాలలో చాలా
నిన్న రాత్రి జరిగిన గాలి బీభత్సానికి పరాకాష్టగా ఉన్నాయి.

మండలంలో రంగయ్య గూడెం దగ్గర కాల్వలలో ప్రవహించలిసిన నీరు వర్షపు నీరు తో కలిసి రోడ్డుమీద పారుతున్నాయి.పంట కోసం తీసిన రోడ్డు పక్కన కాల్వలు కూడా పంట పొలంగా చేశారు. ఇలా ఆక్రమణ కు గురై అవ్వడం వల్ల కాల్వల నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నాయి. అన్ని స్థాయి అధికారులు కొంచెం సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Latest Update : 

మరిన్ని వార్తలు