Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Drinking Water Problem : ఆ గ్రామంలో ఏళ్ల తరబడి నీటి కష్టాలు.. తీర్చే వారే లేరు..!

Drinking Water Problem : ఆ గ్రామంలో ఏళ్ల తరబడి నీటి కష్టాలు.. తీర్చే వారే లేరు..!

కొండమల్లేపల్లి, మనసాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామపంచాయతీ లో ఉన్న దేశ్ ముఖ్ కుంటాలో త్రాగు నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఏళ్ల తరబడిగా మంచినీటి సమస్య ఉన్నా కూడా అధికారులు గానీ ప్రజాప్రతినిధులు గాని ఎవరూ పట్టించుకోవడం లేదు. రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తున్న వరదలు పారుతున్న వాగులు నిండుతున్నా.. ఈ ఊర్లో మాత్రం నీటి సమస్య ఏర్పడింది.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఊరిలో ఉన్న చేతి పంపు (బోరింగ్) లను పీకిపడేసిన దుస్థితి. ఊర్లో ఉన్న ఒకే ఒక్క బోరు ఆనాడు మరమ్మతులు లేక పాడయింది. అయితే దాంట్లో ఉన్న మోటరు ఆనాడు ఉన్న కార్యదర్శి తీసుకెళ్ళి రిపేర్ కి ఇచ్చారు కాని  మరమ్మత్ చేయించి ఫిట్ చేయలేదు.

కుటుంబాలకు కనీసం వాడుకోవడానికి నీరు కరువైపోయింది. ఎప్పుడో అప్పుడు వచ్చే మిషన్ భగీరథ నీరు మీదనే మనుషులు మూగ జీవులు ఆధార పడి ఉన్నాయి. మిషన్ భగీరథ నీరు దానికి ఒక సమాయానికి నీరు వదిలి సమయానికి నీరు బంద్ చేసే వాటర్ లైన్ మెన్ కు లేఖ. నీరు వచ్చింది వచ్చినట్టే అయిపోయే దుస్థితి ఏర్పడింది.

మిషన్ భగీరథ నీరు రానప్పుడల్ల పెద్ద సమస్య గా ఎక్కడో పొలాల్లో ఉన్న బోర్ల దగ్గర తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది అన్నారు. త్రాగడానికి అయితే కొనుకొచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. బోర్ పంపు తీసిన దాంట్లోనే వన్ హెచ్ పి1 హెచ్ పి మోటరు వేపించి నీటి సమస్య ను తీర్చండి అని ఎన్ని సార్లు అధికారులకు ప్రజా ప్రతినిధులకు చెప్పిన ఇటు నుండి విని అటు నుండి గాలికి వదిలేస్తున్నారు అని గ్రామస్తులు వాపోతున్నారు.

మిషన్ భగీరథ నీరు కాకుండా ఇంట్లో వాడుకోవడానికి మూగజీవాలు తాగడానికి ప్రత్యామ్నాయంగా చేతి పంపు (బోరింగ్)నీ అయిన లేక మోటరు అయిన బిగించి ఇప్పటికి అయిన అధికారులు స్పందించి గ్రామ ప్రజల అందరి నీటి సమస్య ని తీర్చవలిసిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు