Miryalaguda : రైతు భరోసా పై వెల్లువెత్తిన నిరసనలు..!
Miryalaguda : రైతు భరోసా పై వెల్లువెత్తిన నిరసనలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
రైతు భరోసా ఈ సీజన్ లో ఇవ్వలేమంటూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు డబ్బులు వెయ్యకుండా రైతుల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో పట్టణములో పార్టీ కార్యాలయం నుంచి ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి ర్యాలీగా వెళ్ళి స్థానిక రౌండ్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వర్షాకాలానికి రైతు భరోసా లేదని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ రైతులకు చేస్తున్న వరుస ద్రోహాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ రైతలకు బీ ఆర్ ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
వానాకాలం రైతు భరోసా ను ఎగ్గొటటం ద్వారా రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసిందని, స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఈ మేరకు ప్రకటన చేయడం దారుణం అన్నారు. ఎన్నికల సమయములో కేసీఆర్ చెప్పినట్లే రైతుబంధుకు రాం రాం చెప్పేశారని, రైతు భరోసా విధి విధానాల పేరుతో మొత్తం రైతుబంధును శాశ్వతంగా ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ ఏడాది వర్షాకాలం పంటకు రైతు భరోసా ఎగ్గొట్టారని అన్నారు.
సబ్ కమిటీ సూచనలు, విధి విధానాలు ఏమీ ఉండవు. ఇక రైతు భరోసా రద్దు అయినట్లే అని, రుణమాఫీ, 500 అదనపు మద్దతు ధర, రైతు భరోసా, రైతుకూలీలు, కౌలు రౌతులకు ఆర్థిక సాయం ఇలా అన్ని ఎగగొట్టారని తెలిపారు. కావున క్షేత్రస్థాయిలో రైతులకు కాంగ్రెస్ మోసాలను వివరించాల్సిన అవసరముందని తెలుపుతూ, వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్దం చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో డీ సి ఎం ఎస్ నల్లగొండ జిల్లా వైస్ ఛైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, నల్లగొండ జిల్లా మాజీ రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, మాజీ జెడ్పీ కో-ఆప్షన్ మెంబర్ ఎండి. మోషీన్ అలీ, పార్టీ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, మాజీ ఏఎంసీ ఛైర్మన్ & వైస్ చైర్మన్ లు బైరం సంపత్,
యడవెల్లి శ్రీనివాస రెడ్డి, ఉద్యమ నాయకులు ఆన్నబీమోజు నాగార్జున చారి, మాజీ జెడ్పీటీసీ అంగోతు లలిత హాతీరాం నాయక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎండి. ఇలియాస్ ఖాన్, బీ ఆర్ ఎస్ వి రాష్ట్ర కార్యదర్శి ఎండి. షోయబ్, చిర్ర మల్లయ్య యాదవ్, చౌగాని బిక్షం గౌడ్, మహిళా కార్యదర్శి కోదాటి రమా, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
-
TG News : 317 జీఓ అమలు నివేదిక సిద్ధం.. సీఎంకు అందజేసిన మంత్రి దామోదర్.. రాజనర్సింహా..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై తుమ్మల కీలక వ్యాఖ్యలు.. ఈ సీజన్ కు లేనట్టేనా..?
-
Viral Video : నేను నిన్ను కొట్టను కానీ.. ఆ టీచర్ రహస్యం, అలా బయటపడింది.. (వీడియో)
-
Video : చీ చీ అంత దారుణమా.. పనిమనిషి వంట గదిలో.. (వీడియో)










