viralBreaking NewsTOP STORIESజాతీయం

Viral Video : బిఏ విద్యార్థి హిస్టరీ ఆన్సర్ షీట్.. ఆ చప్పుడుతో పేపర్ నింపేశాడు.. ఏంటబ్బా (వీడియో)

Viral Video : బిఏ విద్యార్థి హిస్టరీ ఆన్సర్ షీట్.. ఆ చప్పుడుతో పేపర్ నింపేశాడు.. ఏంటబ్బా (వీడియో)

మన సాక్షి, వెబ్ డెస్క్ :

పరీక్షల్లో విచిత్ర జవాబులు రాసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆన్సర్ షీట్లు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. చిన్నారుల ఆన్సర్ షీట్లు ఎక్కువగా వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ బిఏ చదివే విద్యార్థి ఆన్సర్ షీట్ కూడా ఇటీవల వైరల్ గా మారింది.

అతను రాసిన హిస్టరీ ఎగ్జామ్ లో ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటో చూద్దాం.. సంఘం యూనివర్సిటీకి చెందిన బిఎ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ 2024 అక్టోబర్ 14వ తేదీన నిర్వహించారు. పరీక్షకు హాజరైన ఆశిష్ కుమార్ అనే విద్యార్థి పరీక్ష రాశాడు.

అతడు రాసిన పరీక్షలో హిస్టరీ ఎగ్జామ్ కు సంబంధించినది ప్రశ్న వచ్చింది. అలెగ్జాండర్ కు సంబంధించిన ఆ ప్రశ్న.. జీలం యుద్ధాన్ని 300 పదాలలో వివరించండి. అని అడిగారు. అయితే ఆ విద్యార్థి ఆశిష్ కుమార్ రాసిన జవాబుకు పేపర్ దిద్దే టీచర్ అవాక్కయ్యారు.

ఆశిష్ కుమార్ రాసిన జవాబులో భారత దేశంలో జీలం యుద్ధం చాలా ముఖ్యమైనది. అందులో అలెగ్జాండర్ గుర్రాలను వెంబడించాడు అని రాశాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ గుర్రం పరుగు గురించి వివరించాడు. అలెగ్జాండర్ గుర్రం మీద ఎలా వస్తాడో రాస్తూ తపడక్… తపడక్.. అని గుర్రం డెక్కల చప్పుడుతో ఆన్సర్ షీట్ అంతా నింపేశాడు.

ఆ తర్వాత అలెగ్జాండర్, పోరస్ లు ధయ్.. ధయ్.. ధయ్ అని బాణాలు వేసుకున్నారని నింపేశాడు. అతనికి తోచిన ఆన్సర్ పేపర్ మొత్తం శబ్దాలతోనే నింపేశాడు. ఆన్సర్ 80 మార్కులకు గాను అతనికి ఏడు మార్కులు మాత్రమే వేసి టీచర్ తగిన బుద్ధి చెప్పింది.

అంతే కాకుండా ఈ విద్యార్థి చాలా వెనుకబడి ఉన్నాడని రీమార్క్ కూడా రాసింది. ఈ ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్షల మంది ఈ పోస్టును వీక్షించారు. లైక్ చేశారు. కామెంట్లు కూడా చేశారు.

VIDEO : 

 

MORE VIDEOS :

మరిన్ని వార్తలు