Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsసినిమా

Bigg Boss 8 Telugu : బిగ్‌బాస్ 8 లో సెల్ఫ్ గోల్ నాగమణికంఠ.. లక్షల జరిమానా కట్టాల్సిందేనా.. భార్య రియాక్షన్ ఏంటి..?

Bigg Boss 8 Telugu : బిగ్‌బాస్ 8 లో సెల్ఫ్ గోల్ నాగమణికంఠ.. లక్షల జరిమానా కట్టాల్సిందేనా.. భార్య రియాక్షన్ ఏంటి..?

మన సాక్షి, సినిమా :

బిగ్‌బాస్ 8 తెలుగు షో నుంచి నాగమణికంఠ సెల్ఫ్ గోల్ అయ్యాడు. ప్రేక్షకులు అతడిని బిగ్ బాస్ లో కొనసాగే విధంగా ఓట్లు వేసి తీర్పు ఇచ్చినప్పటికీ తాను బిగ్ బాస్ హౌస్ లో ఉండలేను అంటూ నాగార్జునకు విన్నవించాడు. చివరికి నాగార్జున కూడా మరో అవకాశం కూడా ఇచ్చాడు. అయినా కూడా నాగ మణికంఠ స్పెషల్ రిక్వెస్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటపడ్డాడు నాగ మణికంఠ.

ఏడు వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో విజయవంతంగా కొనసాగాడు. ఆయన ఒక ప్రత్యేక ఆకర్షణగా కూడా ఉండి, బిగ్ బాస్ 7లో ఉన్న రైతుబిడ్డ ప్రశాంత మాదిరిగానే చేస్తున్నాడంటూ కూడా విమర్శలు కూడా వచ్చాయి.

తాను ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాడు. అయినా కూడా తాను ఉండలేనంటూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాడు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన నాగమణికంఠ ఎన్ని లక్షల రూపాయలు జరిమానా విధించాల్సి ఉంటుందంటే నిబంధనల మేరకు అగ్రిమెంట్ ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.

కానీ అతడి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం వల్ల బిగ్‌బాస్ హౌస్ నుంచి నాగమణికంఠ బయటకు వచ్చాడు. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు ఒప్పుకుంటే ఆరోగ్య పరిస్థితుల రీప్య ఉన్నందున నాగమణికంఠ జరిమానా కట్టాల్సిన అవసరం లేదు.

ఇదిలా ఉండగా నాగమణికంఠ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున కార్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తన భార్య రియాక్షన్ ఏంటంటే అని కొందరు నాగమణికంఠను ప్రశ్నించగా తాను బిగ్ బాస్ హౌస్ లో కొనసాగినప్పుడు ఆయన భార్య తనకు హౌస్ లోకి లెటర్ పంపిందని అదే తనకు మొదటి లవ్ లెటర్ అని పేర్కొన్నాడు.

చిన్న పాపతో ఉన్న ఆమె ఇక్కడికి రాలేదు కదా అని ఆయన పేర్కొన్నాడు. ఇద్దరికీ కూడా మనస్పర్ధలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆమె ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు