Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : పేగు బంధం మరిచి.. భూమికోసం, సొంత అన్ననే..!

Miryalaguda : పేగు బంధం మరిచి.. భూమికోసం, సొంత అన్ననే..!

మిర్యాలగూడ, మన సాక్షి :

పేగు బంధం, మానవత్వం మరిచాడు. భూమికోసం సొంత అన్ననే చంపాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో చోటుచేసుకుంది.

నిందితులను అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు తెలిపారు. బుధవారం మిర్యాలగూడ డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మాడుగులపల్లి మండలం నారాయణపురం చెందిన కాకునూరి నరసింహులుకు ముగ్గురు కుమారులు ఉన్నారు. కాకునూరి లింగయ్య, కాకునూరి కొండయ్య, కాకునూరి శ్రీనివాసులు ఉన్నారు.

వీరిలో కాకునూరు లింగయ్య గత కొంతకాలం క్రితం మరణించారు. వీరికి తండ్రి ద్వారా సంక్రమించిన ఆరు ఎకరముల భూమిని పెద్ద అన్నయ్య చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా మరియు రెండో అన్నయ్య కొండయ్యకు సంబంధించిన భూమిని కూడా మొత్తంగా ఆరెకరాలను కాకునూరు శ్రీను తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

ఈ విషయం ఇటీవల కాలంలో బయటపడటంతో కాకునూరి కొండయ్య శ్రీను ను భూమిని తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని పట్టుబట్టడమే కాకుండా పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టడం జరిగింది.

కాకునూరి శ్రీను పెద్ద అన్నయ్య అయిన లింగయ్య కు సంబంధించిన భూమి రెండు ఎకరాలు , రెండో అన్నయ్య కొండయ్య సంబంధించిన రెండు ఎకరాలు భూమిని తిరిగి ఇవ్వాలని మనసులో లేకపోవడంతో కొండయ్యపై కక్ష పెంచుకున్నాడు.

ఈనెల 16వ తేదీన కిరాయి మనుషులు వేముల నాగరాజు, పందిరి లింగస్వామి లతో కలిసి మధ్యాహ్నం కొండయ్య ఇంట్లోకి చొరబడి ఆయన పై దాడి చేసి కత్తితో పొడిచి ఆయనని ఆటోలో చీరాల సురేష్, జిట్టబోయిన వెంకన్న సహాయంతో ఎత్తుకుపోతుండగా చుట్టుపక్కల వారు గమనించి వారిని అడ్డుకోవడంతో కొండయ్యను అక్కడ వదిలేసి పరారైపోయారు.

చుట్టుపక్కల వారు కొండయ్యని చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యంలో కొండయ్య మరణించారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు వారు ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి కాకునూరి శ్రీను మరియు లింగస్వామి, నాగరాజు, సురేష్, వెంకన్న ల ను అరెస్ట్ చేసి విచారించి బుధవారం కోర్టుకు రిమాండ్ చేసినట్టు తెలిపారు. సమావేశంలో మిర్యాలగూడ గ్రామీణ, సీఐ వీరబాబు, మాడుగులపల్లి ఎస్సై కృష్ణయ్యలు ఉన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు