KTR : ఏం.. పీక్కుంటారో పీక్కోండి.. నీ బాంబులకు భయపడలేదు..!
KTR : ఏం.. పీక్కుంటారో పీక్కోండి.. నీ బాంబులకు భయపడలేదు..!
మన సాక్షి, డెస్క్:
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారికి అరెస్టు తప్పదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. శుక్రవారం ఆయన సిరిసిల్లలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ బహిరంగ విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏం.. పీక్కుంటారో పీక్కోండి.. నీ బాంబులకు భయపడేది లేదు. కేసులకు భయపడేది లేదు. మేము ఒరిజినల్ బాంబులకే భయపడలేదు. దొంగ కేసులు పెడితే పెట్టుకో.. అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ ఈ డి కేసులు, మోడీ కాళ్లు మొక్కిన బాంబుల గురించి చెప్పు.. చంద్రబాబు, వైఎస్ఆర్ తోనే కొట్లాడినం. ఈ చిట్టి నాయుడు లెక్కనా..
అడ్డమైన కేసులు పెట్టి జైలుకు పంపితే పంపు.. ఆర్ఆర్ టాక్స్ లపై మేము వచ్చాక లెక్క తెలుస్తాం.. ముఖ్యమంత్రి రేవంత్ బామ్మర్ది , పొంగులేటి బాగోతాలు అన్ని బయటకు తీస్తాం.. చావుకు కూడా మేము భయపడం అంటూ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
పేద ప్రజల నడ్డి విరిచేలా సర్కార్ కుట్ట చేస్తుందని మండిపడ్డారు 936 కోట్ల రూపాయల ఛార్జీలు ప్రజల మీద రుద్దుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని, ప్రజల మీద తాము భారం పడనివ్వలేదని చెప్పుకొచ్చారు. 300 యూనిట్లు దాటితే ఒక యూనిట్కు 50 రూపాయలా .. ప్రభుత్వ ఖజానా నింపుకునేది ఇలాగేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
MOST READ :
-
TG News : కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్దమైందా..?
-
SURYAPET : మహిళ ఉద్యోగస్తులను వీడియో కాల్ చేయాలంటూ ఎంపిడిఓ ఒత్తిడి.. ఉద్యోగస్తులు నిరసన..!
-
Phonepe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి అదిరిపోయే శుభవార్త.. ఇది అస్సలు మిస్ చేసుకోకండి..!
-
Hyderabad : కూకట్ పల్లి లో రోడ్లపై వ్యభిచారుల గుర్తింపు.. తహసిల్దార్ వద్ద బైండోవర్..!
-
Miryalaguda : పేగు బంధం మరిచి.. భూమికోసం, సొంత అన్ననే..!
-
Diwali : దీపావళి పండుగ ఎప్పుడు..? ఎన్ని రోజులు సెలవులు..!









