Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newstravelతెలంగాణహైదరాబాద్

Special Busses : కురుమూర్తి జాతరకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు..!

Special Busses : కురుమూర్తి జాతరకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణలో ప్ర‌సిద్ధ క్షేత్ర‌మైన శ్రీ కురుమూర్తి స్వామి జాత‌ర‌కు వెళ్లే భ‌క్తుల సౌక‌ర్యార్థం హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను నడప నున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండి సర్జనార్ తెలిపారు. జాత‌రలో ప్ర‌ధాన ఘ‌ట్ట‌మైన ఉద్దాల ఉత్స‌వం ఈ నెల 8వ తేదిన ఉండ‌గా.. 7 నుంచి 9వ తేది వ‌ర‌కు భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవకాశం ఉంది.

ఈ నేప‌థ్యంలో ఆయా రోజుల్లో ప్ర‌త్యేక బ‌స్సులను హైద‌రాబాద్ నుంచి సంస్థ అందుబాటులో ఉంచుతోంది. ఎంజీబీఎస్ నుంచి ఆరాంఘ‌ర్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ మీదుగా జాత‌ర‌కు వెళ్తాయి. ఈ స్పెష‌ల్ బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్‌ను సంస్థ క‌ల్పిస్తోంది. టికెట్ల బుకింగ్ కోసం tgsrtcbus.in వెబ్ సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు. ఈ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఉప‌యోగించుకుని సుర‌క్షితంగా కురుమూర్తి స్వామిని ద‌ర్శించుకోవాల‌ని టీజీఎస్ఆర్టీసీ ఎండి కోరారు.

MOST READ : 

మరిన్ని వార్తలు