CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి కవల సోదరుడు ఉన్నాడని మీకు తెలుసా.. ఐతే తెలుసుకో..!
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి కవల సోదరుడు ఉన్నాడని మీకు తెలుసా.. ఐతే తెలుసుకో..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే పట్టు వదలని విక్రమార్కుడు. రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సొంతంగా ఎదిగిన వ్యక్తి. సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి.. అని ప్రతి ఒక్కరికి తెలుసు… రేవంత్ రెడ్డి తలుచుకుంటే దానిని పూర్తి చేసే వరకు వదలడని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు..
ముఖ్యమంత్రిగా తొలి పుట్టినరోజు :
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి పుట్టినరోజు వేడుకలను శుక్రవారం జరుపుకున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో ఆయన ముఖ్యమంత్రి హోదాలో తొలి పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు.
రేవంత్ రెడ్డికి కవల సోదరుడు :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లాలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో 1969 నవంబర్ 8వ తేదీన రేవంత్ రెడ్డి జన్మించాడు. ఎనుముల నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు రేవంత్ రెడ్డి చిన్న కుమారుడు.
వారికి మొత్తం ఎనిమిది మంది సంతానం ఉండగా ఏడుగురు మగవారు, ఒక్కరే ఆడబిడ్డ ఉన్నారు. కాగా ఆ దంపతులకు చివరి సంతానంగా కవలలు జన్మించారు. వారిలో ఒకరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగా మరొకరు కొండల్ రెడ్డి. వీరిద్దరూ కవల సోదరులు, వీరిద్దరి రూపురేఖలు కూడా ఒకేలా ఉంటాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి కూడా హైదరాబాదులోనే ఉంటున్నాడు. వ్యాపారాలు చేసుకుంటూ ఉంటున్నాడు.
MOST READ :
-
Gold Price : పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. తెలుగు వారిని ఒక్కరోజే మురిపించింది..!
-
TG News : కుటుంబ సర్వే పై అపోహలు సృష్టించే ప్రయత్నం.. సంక్షేమ పథకాలు పోతాయని దుష్ప్రచారం..!
-
Viral Video : బాలయ్య బాబు స్టెప్పులకు టీచర్ ఫిజిక్స్ పాఠాలు.. ఇలా కూడా చెప్పొచ్చు (వీడియో)
-
Gold Price : ట్రంప్ గెలుపు.. భారీగా పతనమైన పసిడి.. ఒకే రోజు రూ.17,900 తగ్గిన ధర..!










