Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : జిల్లా స్థాయి షాట్ పుట్ లో సెయింట్ జాన్స్ విద్యార్థినికి ప్రథమ స్థానం..!

Miryalaguda : జిల్లా స్థాయి షాట్ పుట్ లో సెయింట్ జాన్స్ విద్యార్థినికి ప్రథమ స్థానం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నల్లగొండ ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియంలో స్కూల్ గేమ్స్ టోర్నమెంట్, సెలక్షన్స్ ను నిర్వహించారు. జిల్లా స్థాయి షాట్ పుట్ పోటీలలో మిర్యాలగూడ కు చెందిన సెయింట్ జాన్స్ హై స్కూల్ విద్యార్థిని ప్రథమ స్థానం పొందింది.

ఈ పోటీలకు మిర్యాలగూడ సెయింట్ జాన్స్ పాఠశాల విద్యార్థులు, శిష్య పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. 9వ తరగతికి చెందిన సిరిమానిత జిల్లాస్థాయి మొదటి స్థానం పొందింది. దాంతో పాఠశాల చైర్మన్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి విద్యార్థినిని అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా పాఠశాలలో చదివే విద్యార్థులకు క్రమశిక్షణ చదువుతో పాటు క్రీడలలో కూడా రాణిస్తారని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో షాట్ పుట్ మొదటి స్థానం పొందడం వల్ల చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు