Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుహైదరాబాద్

Hyderabad : కుటుంబ సర్వే.. 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్..!

Hyderabad : కుటుంబ సర్వే.. 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్..!

శేరిలింగంపల్లి, మన సాక్షి

సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేలో భాగంగా చందానగర్ సర్కిల్ లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో కుటుంబాల వారీగా వివరాల సేకరణకు సుపర్వైసర్లకు ఎన్యుమరేటర్లుకు అప్పగించిన మొదటి రౌండ్ కుటుంబాల గుర్తింపు శుక్రవారంతో పూర్తయింది.

రెండో రౌండ్ లో భాగంగా గుర్తించిన కుటుంబ సభ్యుల వివరాలు అనగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన సేకరణకు ఎన్యుమరేటర్లకు మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పి.మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ కుటుంబ సర్వేలో భాగంగా ప్రతి ఎన్యుమరెటర్ రోజూ పది నుండి పదిహేను కుటుంబాల సభ్యుల వివరాలను ఫారం లో అడిగిన విధం గా తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని ఆదేశించారు.

ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్  క్షేత్ర స్థాయి లో విధులు కేటాయించమని, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, మరియు కులము వివరములు జాగ్రత్తగా మార్గదర్శక పుస్తకం లో సూచించిన ప్రకారం పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని ప్రతి రోజు సంబధిత సుపర్వైసర్లు పది శాతం ఎన్య్యూమరేటర్ల నమోదును క్షేత్ర స్థాయిలో తనిఖీ లు నిర్వహించి ఎన్యుమరేటర్లకు తగు మార్గదర్శకత్వం చేయాలని డిప్యూటీ కమిషనర్ ఆదేశించడం జరిగింది.

ఈ కుటుంబ వివరాల సేకరణ జరుగుతున్న తీరును డిప్యూటీ కమిషనర్ తన సిబ్బంది తో కలిసి 110 వార్డు లోని శాంతినగర్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఎన్యుమరెటర్ కు,తగు సూచనలు చేశారు. కాగా ఇట్టి కుటుంబ వివరాల సేకరణకు సర్కిల్ పర్యవేక్షకులు గా ప్రధాన కార్యాలయం నుండి చంద్రకాంత్ రెడ్డి అడిషనల్ కమిషనర్ ని పర్యవేక్ష్కుడిగా నియమించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమం లో సర్కిల్ ఏసిపి నాగిరెడ్డి , ప్రాజెక్టు అధికారిని ఉషా రాణి, ఏ ఎం సి లు విజయ్ కుమార్, కృష్ణ పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు