PI Phone : ఇంటర్నెట్, చార్జింగ్ అవసరం లేని స్మార్ట్ ఫోన్.. డిసెంబర్ లో లాంచ్, తెగ వైరల్..!
PI Phone : ఇంటర్నెట్, చార్జింగ్ అవసరం లేని స్మార్ట్ ఫోన్.. డిసెంబర్ లో లాంచ్, తెగ వైరల్..!
మన సాక్షి , వెబ్ డెస్క్ :
సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. టెస్లా కంపెనీకి చెందిన PI స్మార్ట్ ఫోన్ దానికి ఇంటర్నెట్ అవసరం లేదు, చార్జింగ్ అవసరం లేదు, అది డిసెంబర్ల లోనే లాంచ్ అవ్వబోతుంది… అంటూ తెగ వైరల్ అవుతుంది. అత్యాధునిక ఫీచర్లతో అతిపెద్ద విప్లవం రాబోతోంది.. అంటూ ప్రచారం జోరుగా సాగుతుంది.
సంచలన నిర్ణయాలతో ఎప్పుడు వార్తల్లో ఉండే ఎలెన్ మస్క్ ఇంటర్నెట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు. కొత్తగా సెల్ ఫోన్ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించేందుకు అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ను ఈ ఏడాది 20 24 డిసెంబర్ లో లాంచ్ చేస్తున్నట్లుగా ఇంటర్నెట్ లో పుకార్లు, షికార్లు చేస్తున్నాయి.
కొత్తగా వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ కు ఇంటర్నెట్ అవసరం లేకుండా వాడుకునే అవకాశం ఉంటుందని, చార్జింగ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదని ప్రచారం జోరుగా సాగుతుంది. టెస్లా పి ఐ స్మార్ట్ ఫోన్లో మూడు అత్యాధునిక ఫీచర్లు వస్తున్నాయని రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. వాటిలో..
మొదటి ఫీచర్ : ఈ ఫోన్ కు ఇంటర్నెట్ అవసరం లేదు. Space X స్టార్ లింక్ ద్వారా శాటిలైట్ కనెక్టివిటీ తో వస్తుంది. అని అంచనా వేస్తున్నారు.
రెండో ఫీచర్ : చార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది సోలార్ సిస్టంతో దానంతట అదే ఛార్జింగ్ చేసుకుంటుంది.
మూడో ఫీచర్ : టెస్లా స్మార్ట్ ఫోన్ లో గ్రహాంతర కనెక్టివిటీ కూడా ఉంటుందనేది అంచనా.
వాస్తవం ఏంటంటే..?
టెస్లా నుంచి బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ విడుదల గురించి టెస్లా గాని, సీఈఓ ఎలన్ మస్క్ గాని అధికారికంగా ధ్రువీకరించలేదు. 2021 నుంచి టెస్లాపై ఫోన్ గురించి పుకార్లు ఉన్నప్పటికీ ఈ పుకార్లు టెస్లా ద్వారా ధ్రువీకరించదగిన ప్రకటనలు ఎలాంటివి రాలేదు.
అయితే ఎలన్ మస్క్ తన ఎక్స్ లో స్మార్ట్ ఫోన్ అభివృద్ధి చేయడంలో తనకు ఎలాంటి ఆసక్తి లేదని గతంలోనే చెప్పారు. అయితే ఇంటెర్నెట్ లో టెస్లా PI ఫోన్ గురించి వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అని తేలిపోయింది.
MOST READ :
-
Rythu : రైతులకు అదిరిపోయే న్యూస్.. రేపే ఖాతాలోకి డబ్బులు..!
-
Forest Jobs : రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఉద్యోగాలు.. నెలకు రూ.31 వేల వేతనం..!
-
Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ అర్హత ఉంటే చాలు.. కోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..!
-
Viral Video : ఆ మహిళను కారులోంచి గుంజి మరీ పిచ్చకొట్టుడు.. (వీడియో)










