Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఉద్యోగంవైద్యంహైదరాబాద్

JOBS : నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీ శుభవార్త.. లక్షల్లో ప్యాకేజీ, ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానం..!

JOBS : నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీ శుభవార్త.. లక్షల్లో ప్యాకేజీ, ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానం..!

మన సాక్షి :

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితులలో ఉద్యో గాల సాధన చాలా కష్టంగా మారింది. కానీ ఆ కంపెనీ మాత్రం లక్షల్లో ప్యాకేజీ ప్రకటించి ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో నిరుద్యోగుల్లో ఆనందం నెలకొన్నది.

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఫిక్స్డ్ టెన్యూర్ బేసిస్ పై 229 ఇంజనీరింగ్ నియామకాలకు దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన వారంతా డిసెంబర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు.

ఇంజనీరింగ్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఆ సంస్థ కోరింది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 28 సంవత్సరాల వయసు మించకుండా ఉండాల్సి ఉంది.

వీరికి నెలకు వేతనం 40,000 నుంచి 1.40 లక్షల రూపాయల వరకు అందజేయనున్నారు. సుమారుగా ఏడాదికి ప్యాకేజీ 12 లక్షల నుంచి 12.5 లక్షల వరకు ఉన్నది. పరీక్ష కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టు , ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.

అర్హులైన వారు ఆన్ లైన్ లో ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.bel-india.in చూడగలరు.

MOST READ : 

మరిన్ని వార్తలు