Rythu Bharosa : రైతు భరోసా కు నిధులు సిద్ధం.. ఇక ఖాతాలలో జమ..!
Rythu Bharosa : రైతు భరోసా కు నిధులు సిద్ధం.. ఇక ఖాతాలలో జమ..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా అందించేందుకు సిద్ధపడింది. ఇటీవల నల్లగొండ ప్రజా ప్రభుత్వ వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బారోస పై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి తర్వాత రైతులకు రైతు భరోసా అందజేస్తామని, ఎవరో చెప్పిన మాటలు నమ్మొద్దని పేర్కొన్నారు.
కాగా ఇప్పటికే రైతు భరోసా అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రైతుబంధు పథకంలోని లోపాలను సరిదిద్దేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, రైతుల అభిప్రాయాలను సేకరించడం పూర్తయింది. కాగా విధి విధానాలను ఖరారు చేసి రైతులకు నేరుగా వారి ఖాతాలలో డబ్బులు జమ చేయనున్నారు.
రైతు భరోసా అందజేయడానికి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు 7000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. కాగా ఈ పథకం అమలు చేయడానికి నిధులను సమకూర్చుకోవడానికి ప్రభుత్వం 10వేల కోట్ల రూపాయల రుణం తీసుకోవాలని నిర్ణయించింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసి) ఆధీనంలో ఉన్న భూమిని తనఖ పెట్టి పదివేల కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు నిర్ణయించింది.
ప్రభుత్వం ప్రతిపాదన మేరకు 9.6% వార్షిక వడ్డీతో పదివేల కోట్ల రూపాయల అప్పు ఇవ్వడానికి ఐసిఐసిఐ బ్యాంకు ముందుకు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ నెలాఖరులోగా ప్రభుత్వం రుణం తీసుకోనున్నది. ఈ విషయంపై సంప్రదింపులు కొనసాగుతున్నాయి. రుణం పొందిన వెంటనే రైతులకు రైతుల ఖాతాలలో రైతు భరోసా జమ చేయనున్నారు.
MOST READ :
-
TG News : తెలంగాణ పల్లెల్లో ఇంటర్నెట్ విప్లవం.. రూ. 300కే ఇంటర్నెట్ కనెక్షన్, టెలిఫోన్, ఓటీటీ లు..!
-
Holidays : స్కూళ్లకు వరుసగా మూడు రోజులు హాలీడేస్..!
-
Gold Price : పసిడి ప్రియులకు షాక్.. ఒక్కరోజే రూ.8200 పెరిగింది, ఈరోజు తులం ధర..!
-
District collector : నెలాఖరులోపు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!









