Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
టెక్నాలజీBreaking Newsతెలంగాణ

TG News : తెలంగాణ పల్లెల్లో ఇంటర్నెట్ విప్లవం.. రూ. 300కే ఇంటర్నెట్ కనెక్షన్, టెలిఫోన్, ఓటీటీ లు..!

TG News : తెలంగాణ పల్లెల్లో ఇంటర్నెట్ విప్లవం.. రూ. 300కే ఇంటర్నెట్ కనెక్షన్, టెలిఫోన్, ఓటీటీ లు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ని పల్లెల్లో ఇంటర్నెట్ విప్లవం తీసుకురానున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు కూడా తక్కువ ధరకే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు.

దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఇంటర్నెట్ కనెక్షన్ తో పాటు టెలిఫోన్, తెలుగు ఓటీటీ లను కూడా ప్రజలను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి కేవలం నెలకు 300 రూపాయలకు మాత్రమే చెల్లించాల్సి ఉంది. మొదటి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలోని 2096 గ్రామపంచాయతీలో దీనిని అమలు చేయనున్నారు.

20MBPS స్పీడుతో ఈ కనెక్షన్ ఉంటుంది. ఈ కనెక్షన్ గ్రామంలోని అన్ని కార్యాలయాలకు, స్కూళ్లకు కూడా ఇవ్వనున్నారు. ప్రతి ఇంట్లో టీవీనే కంప్యూటర్ గా కూడా మారుతుంది. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దాంతో పాటు ఈ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునే వారితో హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడే వీలు కూడా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రతి గ్రామంలో కూడళ్ల వద్ద, ఇతర చోట్ల కూడా అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఫైబర్ నెట్ తో అనుసంధానం చేయనున్నారు. వీటిని సమీపంలోని ప్రతి పోలీస్ స్టేషన్ కు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేస్తారు.

MOST READ : 

మరిన్ని వార్తలు