Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవైద్యం

District collector : స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. జిల్లా కలెక్టర్..!

District collector : స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. జిల్లా కలెక్టర్..!

మన సాక్షి, నల్గొండ (పీఏ పల్లి) :

నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా న్న 2 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.

ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న పీఏ పల్లి మండలం లేదా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన స్థానిక అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని తెలిపారు.అలాగే అభ్యర్థులు జనరల్ నర్సింగ్ లేదా బిఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలని, 18 నుండి 35 సంవత్సరాల లోపు వయసున్న అభ్యర్థులు ఇందుకు అర్హులని, పోస్టుల భర్తీ లో మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి ,ఆర్డిఓ, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండల స్థాయి కమిటీ ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తుందని, ఎంపికైన అభ్యర్థులు ఔట్ సోర్సింగ్ పద్ధతిన నెలకు 19500/- రూపాయల వేతనంతో పనిచేయాల్సి ఉంటుందని , పి ఏ పల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఆవరణలోని క్వార్టర్స్ లొనే నివాసం ఉండాల్సి ఉంటుందని తెలిపారు.

పై నిబంధనలకు కట్టుబడి పని చేసేందుకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు పై 2 స్టాఫ్ నర్స్ పోస్టులకు ఈ నెల 31 లోగా పి ఏ పల్లి మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు