తెలంగాణBreaking Newsసంక్షేమం

New Scheme : తెలంగాణ మహిళలకు అదిరిపోయే పథకం.. ప్రతి మహిళకు 10 లక్షలు.. వివరాలు ఇవే..!

New Scheme : తెలంగాణ మహిళలకు అదిరిపోయే పథకం.. ప్రతి మహిళకు 10 లక్షలు.. వివరాలు ఇవే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడానికి ప్రత్యేక శ్రద్ధ వహించారు. మహిళల కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి మహిళ 10 లక్షల రూపాయలను పొందవచ్చును. అది ఎలా అంటే తెలుసుకుందాం..

తెలంగాణలో మహిళ స్వశక్తి సంఘాలు చాలా ఉన్నాయి. ఈ సంఘాలకు ప్రభుత్వం రుణాలను అందజేస్తుంది. మహిళలు స్వయం శక్తితో ఎదగాలనే ఉద్దేశంతో మహిళా సంఘాల సభ్యులకు 10 లక్షల రూపాయల వరకు రుణాలను అందజేస్తుంది. ఈ పథకం స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలకు మాత్రమే వర్తిస్తుంది.

ఈ పథకం పొందాలంటే స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉండి 60 సంవత్సరాల లోపు ఉండాలి. సభ్యురాలు సాధారణంగా మరణిస్తే ఆమె కుటుంబానికి ప్రభుత్వం 2 లక్షల బీమా పరిహారం అందజేస్తుంది. ఒకవేళ సభ్యురాలు ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల బీమా అందజేస్తుంది.

అయితే ఈ ప్రయోజనాన్ని మహిళా సభ్యురాలు బతికి ఉండగానే పొందే వీలు కూడా ఉంది. అది ఎలా అని అంటే.. సంఘంలో సభ్యురాలు అయిన మహిళ బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు పొందవచ్చును. చిన్న వ్యాపారం, చిన్న పరిశ్రమ లాంటిది పెట్టుకోవచ్చును. అయితే ఒకవేళ సంఘంలో ఉన్న సభ్యురాలు చనిపోతే మిగతా సంఘంలో ఉన్న సభ్యులంతా కలిసి ఆమె రుణమును చెల్లించాల్సి ఉంది.

కానీ ఈ పథకం వల్ల ఆమె పేరున బీమా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చే బీమా పరిహారం డబ్బుతో ఆమె బ్యాంకులో తీసుకున్న రుణాన్ని చెల్లించవచ్చును. బ్యాంకు రుణం తీరిన తర్వాత మిగతా డబ్బు ఉంటే కుటుంబ సభ్యులకు అందజేస్తారు. అయితే దీనికి సంబంధించిన బీమా రుసుమును మహిళ స్వశక్తి సంఘాల్లో ఉన్న సభ్యులు చెల్లించాల్సిన అవసరం లేదు. సభ్యురాలు తరపున ప్రభుత్వమే చెల్లిస్తుంది.

ఈ పథకం 13 మార్చి 2025 వరకు వర్తిస్తుంది. ఇప్పటివరకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. ఆ తర్వాత కూడా ఇదే విధంగా కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం కంటిన్యూ చేయకుంటే ప్రీమియం డబ్బులను మహిళా సంఘాల సభ్యులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఇలాంటి పథకంలో చేరడం వల్ల మహిళలకు ఆర్థిక ధీమా కలిగే అవకాశాలు ఉన్నాయి.

MOST READ : 

మరిన్ని వార్తలు