Holidays : సంక్రాంతి హాలిడేస్ పై క్లారిటీ.. ఎన్ని రోజులు సెలవులో తెలుసా..!
Holidays : సంక్రాంతి హాలిడేస్ పై క్లారిటీ.. ఎన్ని రోజులు సెలవులో తెలుసా..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలుగు రాష్ట్రాలలో నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ సందడి అప్పుడే మొదలైంది. ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ సంక్రాంతి పండుగకు పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ఇంకా సెలవులపై స్పష్టత ఇవ్వలేదు. కానీ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మాత్రం సంక్రాంతి సెలవులు పై క్లారిటీ ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి పండుగ సెలవులను అధికారులు ప్రకటించారు. కాగా తెలంగాణలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయినప్పటికీ 2025 జనవరి లో సంక్రాంతి సెలవులు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉన్నాయి. మొత్తంగా ఆరు రోజులు సంక్రాంతికి హాలిడేస్ ఉన్నాయని విద్యాశాఖ వెల్లడించింది.
కానీ ఈ తేదీలలో సెలవులు ఉంటాయా ఇంకా ఏమైనా మార్పులు ఉంటాయని విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణలో 2025 సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో మొత్తం 27 సాధారణ సెలవులు ఉండగా 23 ఆప్షనల్ సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులు తెలిపింది.
MOST READ :
-
District Collector : నో సండే, నో హాలిడే.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
Heater water : చలికాలం హీటర్ వాటర్‌తో స్నానం చేస్తున్నారా.. అయితే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!
-
Youtube Videos : ఇంటర్నెట్ లేకుండానే యూట్యూబ్‌లో వీడియోలు చూడొచ్చా.. సూపర్ ఫీచర్ మీకు తెలుసా..!
-
ACB : రైతుల నుంచి లంచం తీసుకుంటు.. ఏసీబీకి పట్టుబడిన రెవెన్యూ సర్వేయర్..!
-
Gold Price : మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఆనందంలో పసిడి ప్రియులు..!









