Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : ఘనంగా ట్రస్మా పట్టణ అధ్యక్షులు వరప్రసాద్ పుట్టినరోజు వేడుకలు..!

Miryalaguda : ఘనంగా ట్రస్మా పట్టణ అధ్యక్షులు వరప్రసాద్ పుట్టినరోజు వేడుకలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ట్రస్మా (ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్) మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు, లోటస్ స్కూల్ చైర్మన్ బొడ్డుపల్లి వరప్రసాద్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. స్థానిక అశోక్ నగర్ లోని లోటస్ పాఠశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వరప్రసాద్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ నాయకులు వరప్రసాద్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అభ్యాస్ విద్యాసంస్థల చైర్మన్, ట్రస్మా స్టేట్ కోఆర్డినేటర్ వంగాల నిరంజన్ రెడ్డి, ట్రస్మా జిల్లా నాయకులు కుందూరు శ్యాంసుందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు కందాల శ్రీనివాస్ చారి, ట్రస్మా టౌన్ సెక్రటరీ ఓరుగంటి శ్యాంసుందర్, ట్రస్మా ట్రెజరర్ శ్రీధర్ రెడ్డి, డౌహిల్ హైస్కూల్ కరస్పాండెంట్ సాయి శ్రీనివాస్, కాకతీయ హై స్కూల్ కరస్పాండెంట్ చీదళ్ళ వెంకట్,

భారత్ హై స్కూల్ కరస్పాండెంట్ మహమ్మద్ ఖాన్, ఆర్ఎస్ కిడ్స్ స్కూల్ కరస్పాండెంట్ సురేందర్ రెడ్డి, కృష్ణవేణి హై స్కూల్ కరస్పాండెంట్ ప్రభాకర్ రెడ్డి, ఐ ఎం ఎస్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీ విద్యోదయ స్కూల్ కరస్పాండెంట్ నరసింహారెడ్డి, చార్లీ, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు