Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో ఆపరేషన్ చెబుత్ర..!

Miryalaguda : మిర్యాలగూడలో ఆపరేషన్ చెబుత్ర..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ డి.ఎస్.పి కె. రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో ఆపరేషన్ చెబుత్ర నిర్వహించారు. అందులో భాగంగా అర్ధరాత్రి మిర్యాలగూడ పట్టణంలో నాలుగు ప్రదేశాలలో అకస్మిక తనిఖీలు చేశారు.

కారణం లేకుండా ఆకారణంగా రోడ్ పై తిరుగుతున్న (25) వాహనాలను, 30 మంది వ్యక్తులను పట్టుబడి చేసి (16) డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. అట్టి వాహనాల యొక్క డాక్యుమెంట్స్ పరిశీలించి సరేనా పత్రాలు లేని వాహనాలపై చట్టపరమైన చర్య తీసుకోవడమైనది. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మరొకసారి అర్ధరాత్రిలు రోడ్డుపై కనిపిస్తే కేసులు తప్పవని బైండోవర్లు కూడా చేస్తామని హెచ్చరించి పంపించడం అయినది.

ఈ ఆపరేషన్ లో మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ పి. నాగార్జున, మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ బి. రాంబాబు, మిర్యాలగూడ వన్ టౌన్ ఎస్ఐ ఏ. సైది రెడ్డి, అడవిదేవులపల్లి ఎస్ఐ శేఖర్, మిర్యాలగూడ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్, వేములపల్లి ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు లు సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు