Gold Price : పరుగులు పెడుతున్న గోల్డ్.. నూతన సంవత్సరంలో హ్యాట్రిక్..!
Gold Price : పరుగులు పెడుతున్న గోల్డ్.. నూతన సంవత్సరంలో హ్యాట్రిక్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
కొత్త సంవత్సరంలో మహిళలకు బంగారం ధర షాక్ తినిపిస్తుంది. వరుసగా మూడో రోజు భారీగా ధర పెరిగింది. మూడు రోజులు వరుసగా ధర పెరుగుతూ హ్యాట్రిక్ కొట్టింది.
నూతన సంవత్సరంలో 1వ తేదీన 100 గ్రాముల బంగారంకు 4400 పెరగగా 2వ తేదీన 3300 రూపాయలు పెరిగింది. కాగా 3వ తేదీన 100 గ్రాముల బంగారం కు భారీగా 8700 పెరిగి తులం బంగారం 80 వేలకు చేరువ అయ్యింది.
100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం గురువారం 7,18,000 ఉండగా శుక్రవారం 8 వేల రూపాయలు పెరిగి 7,26,000 గా ఉంది. అదే విధంగా 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం గురువారం7,83,300 రూపాయలు ఉండగా శుక్రవారం 8700 పెరిగి 7,92,000గా ఉంది.
హైదరాబాదులో శుక్రవారం తులం (10 గ్రాముల) బంగారం 22 క్యారెట్స్ ధర 72,600 ఉండగా 24 క్యారెట్స్ ధర 79,200 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి.
RELEATED NEWS :









