తెలంగాణBreaking Newsవైద్యంవ్యవసాయంహైదరాబాద్

Rythu Bharosa : రైతు భరోసా కు నిబంధనలు ఖరారు.. దరఖాస్తు ఎలా.. ఎక్కడ చేసుకోవాలి..!

Rythu Bharosa : రైతు భరోసా కు నిబంధనలు ఖరారు.. దరఖాస్తు ఎలా.. ఎక్కడ చేసుకోవాలి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సహాయం అందజేసేందుకు సిద్ధమైంది. సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయనున్నారు. ఎకరానికి 15000 రూపాయలను పెట్టుబడి సహాయంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా సంక్రాంతికి ఒక విడత ఎకరానికి 7500 సహాయాన్ని రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు.

రైతు భరోసా అమలు చేసేందుకు విధివిధానాల ఖరారు పై ఇప్పటికే మంత్రి మండలి ఉప సంఘం పలు పర్యాయాలు భేటీ అయింది. రైతుబంధు పథకంలో అనేక అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్న నేపథ్యంలో రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు.

రైతు భరోసా పథకంలో కేవలం పంటలు సాగు చేసిన వారికి మాత్రమే సహాయం చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా రాళ్లు, రప్పలు, గుట్టలు, చెట్లు ఉండి సాగులోకి లేని భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నారు.

ఈ మేరకు మంత్రిమండలి ఉప సంఘం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మంత్రి మండలి ఉప సంఘం నిర్ణయాలను ఈ నెల 4వ తేదీన నిర్వహించే మంత్రి మండలి సమావేశంలో నివేదిక అందజేయనున్నారు. ఫైనల్ గా మంత్రిమండలి నిర్ణయంతో రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి రైతు భరోసా పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు.

ఇదిలా ఉండగా రైతు భరోసా పథకం కోసం రైతులు దరఖాస్తు చేసుకునే చేసుకోవలసి ఉంది. ఈనెల 5, 6, 7వ తేదీలలో రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ అధికారులచే గ్రామాలలో గ్రామసభలు నిర్వహించనున్నారు.

ఈ మూడు రోజులపాటు అన్ని గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. రైతుల దరఖాస్తుల ఆధారంగా వ్యవసాయ అధికారులు ఫీల్డ్ సర్వే నిర్వహించడంతో పాటు శాటిలైట్ సర్వే ఆధారంగా సాగు భూమిని నిర్ధారించనున్నారు. ఆ తర్వాత సాగు చేస్తున్న పంట పొలాలకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నారు.

ఈనెల 14వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి సుమారు నెల రోజులపాటు రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయనున్నట్లు సమాచారం.

MOST READ : 

మరిన్ని వార్తలు