TOP STORIESBreaking Newsజాతీయం

UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!

UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ప్రస్తుత పరిస్థితుల్లో లావాదేవీలు ఎక్కువగా యూపీఐ ద్వారానే కొనసాగుతున్నాయి. చిన్న మొత్తంలో నుంచి పెద్ద అమౌంట్ కూడా యూపీఐ ద్వారానే లావాదేవీలు చేపడుతున్నారు. అయితే హ్యాకర్లు, మోసగాళ్ల కారణంగా బ్యాంకు ఖాతా వ్యక్తిగత డేటా పరంగా ఈ ఫీచర్ వినియోగదారులకు కొన్ని సమయాల్లో ప్రమాదకరంగా కూడా మారుతుంది.

అయితే యూపీఐ పేమెంట్ మోడ్ లో ఒక మోడ్ ని ఆన్ చేయడం వల్ల మీ బ్యాంకు ఖాతా ప్రమాదంలో పడుతుందని మీకు తెలియదు. అది ఎలానో తెలుసుకుందాం..

విద్యుత్ బిల్లులు, ఫోన్ రీఛార్జిలు, యూపీఐ ని ఉపయోగించి చేస్తారు. దాంతో పాటు OTT యాప్లను రీఛార్జి చేస్తారు. ప్రతినెల చేయవలసి వస్తే టెన్షన్ ఫ్రీగా ఉండటానికి యూపీఐ ఆటో పే మోడ్ ని ఉపయోగించుకోవాలని భావిస్తారు. అది కొన్ని సమయాల్లో యూపీఐ ఆటో పే మోడ్ కారణంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆటో పే మోడ్ అంటే ఏమిటి?

యూపీఐ ఫీచర్లలో ఒకటి ఆటో పే మోడ్ ఉంటుంది. ఇది వినియోగదారులకు ఆటోమేటిక్ గా చెల్లింపులు చేయడానికి ఇది అనుమతిస్తుంది. దీనికి పిన్ నమోదు చేయవలసిన అవసరం లేదు. ఒకసారి పిన్ ని నమోదు చేయడం ద్వారా మీరు యూపీఐ పిన్ భవిష్యత్తులో సులభంగా పిన్ నమోదు చేయకుండా చెల్లింపు చేయవచ్చును. నెలవారీగా చెల్లింపు చేసే రీచార్జిలు ఉన్నట్లయితే బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్ గా డబ్బులు కట్ అయిపోతుంటాయి.

ఎందుకంటే ఆ బ్యాంకుల్లో ఒకసారి ఆటో పే సౌకర్యం ఎనేబుల్ అయి ఉంటే ఆ కంపెనీలకు అవసరం ఉన్నా లేకపోయినా డబ్బులు వెళుతుంటాయి. యూపీఐ ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్ ఉపయోగించి మీరు పేమెంట్ చేయకూడదు. మీరు ఒకసారి యాప్స్ కి సంబంధించిన ఆటో పేమోడ్ ని ఆఫ్ చేసుకోవాలి. లేకపోతే మీ ఎకౌంటు లోని డబ్బులు పోవడం ఖాయం.

పే మోడ్ ఎలా డిజేబుల్ చేయాలి..?

ఫోన్ పే, గూగుల్ పే ప్రొఫైల్లోకి వెళ్ళండి. పేమెంట్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయాలి. అక్కడ ఆటో పే అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి. అప్పుడు మీరు ఆటో పే ఆప్షన్ ఇచ్చిన యాప్స్ కనిపిస్తాయి. దాని పక్కనే మీకు పాజ్ ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఒకవేళ ఆ యాప్ ని భవిష్యత్తులో ఉపయోగించే అవకాశం ఉంటే పాజ్ క్లిక్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్ గా ఆటో పే ఆప్షన్ తాత్కాలికంగా నిలిచిపోతుంది. తిరిగి యాప్ ను చేసుకుంటే సరిపోతుంది.

ఒకవేళ మీరు భవిష్యత్తులో ఆ యాప్ ను ఉపయోగించే అవకాశం లేకుంటే కింది భాగంలో డిలీట్ ఆటో పే అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేస్తే యాప్ మొత్తం మీకు డిలీట్ అయిపోతుంది. మీ డబ్బులు కట్ అయ్యే చ్చాన్స్ ఉండదు.

MOST READ : 

మరిన్ని వార్తలు