Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

SBI : లక్షాధికారి కావడం చాలా సింపుల్.. SBI అదిరిపోయే కొత్త స్కీం.. అందరికీ ఉపయోగమే..!

SBI : లక్షాధికారి కావడం చాలా సింపుల్.. SBI అదిరిపోయే కొత్త స్కీం.. అందరికీ ఉపయోగమే..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సంపాదించాలని, లక్ష్యాధికారి కావాలని కోరుకుంటారు. అయితే లక్ష రూపాయల డబ్బు సంపాదించడం కష్టమైన పనే. కానీ SBI కొత్త స్కీం తీసుకొచ్చింది. అయితే ఆ స్కీమ్ లో చేరితే అతి తక్కువ కాలంలోనే లక్ష రూపాయలు మీ ఖాతాలో జమవుతాయి. అది ఎలానో తెలుసుకుందాం.

SBI ప్రభుత్వ రంగ బ్యాంకు. దీనిలో “హర్ ఘర్ లక్పతి” అనే గేమ్ చేంజర్ పథకాన్ని ప్రారంభించింది. రికరింగ్ డిపాజిట్ పథకం ద్వారా లక్ష రూపాయలు.. అంతకంటే ఎక్కువ సొమ్మును తక్కువ పెట్టుబడితో పొందవచ్చును. చాలా సింపుల్ గా మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చును.

హర్ ఘర్ లక్పతి పథకం ప్రత్యేకత ఏంటంటే.. సేవింగ్స్ స్కీం లో గతంలో ఉండే ఇబ్బందులను ఈ స్కీం లో లేకుండా రూపొందించింది. అయితే వినియోగదారులు తమకు నచ్చిన నెలవారి అమౌంటు, కాల పరిమితిని ఎంచుకునే వీలు కల్పించింది. ఈ పథకం పెద్దలకు మాత్రమే కాకుండా చిన్నారులకు సౌకర్యం కల్పించింది.

ఈ స్కీమ్ లో చేరే వారు కనీసం 12 నెలల టెన్యూర్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 120 నెలల వరకు చెల్లించవచ్చు. ఈ స్కీమ్ లో ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పరిమితి పెట్టుకుంటే 6. 80 శాతం రేటును పొందవచ్చును. రెండు సంవత్సరాలకు పైగా అయితే 7 శాతంకి పెరుగుతుంది. దీర్ఘకాలిక కమిట్మెంట్ల కోసం 6.75% నుండి 6.5% వరకు మారుతూ ఉంటుంది. అయితే ఈ స్కీం లో చేరాలనుకుంటే SBI శాఖకు వెళ్లవచ్చు లేదా హర్గర్లక్పతి ఎకౌంట్ ను ఆన్‌లైన్ లో కూడా వెబ్సైట్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు.

ఇలా పొందవచ్చు :

ఒక సాధారణ వ్యక్తి ప్రతి నెల 2500 రూపాయల పెట్టుబడి పెడితే 6.75% వడ్డీ రేటు తో మూడు సంవత్సరాలలో ఒక లక్ష రూపాయలను పొందవచ్చును.

అదే వడ్డీ రేటు తో నాలుగు సంవత్సరాల పాటు ప్రతినెల 1810 పెట్టుబడి పెడితే లక్ష రూపాయలు పొందవచ్చును.

6.50% వడ్డీ రేటు తో ప్రతినెల 1407 రూపాయలు ఐదు సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే లక్ష రూపాయలను పొందవచ్చును.

సీనియర్ సిటిజన్ అయితే :

మూడు సంవత్సరాల పాటు ప్రతి నెల 2480 రూపాయల పెట్టుబడి పెడితే 7.25% వడ్డీతో లక్ష రూపాయలు వస్తాయి.

అదే వడ్డీతో 1791 రూపాయలు నాలుగు సంవత్సరాల పాటు చెల్లిస్తే లక్ష రూపాయలు అందజేస్తారు.

ఒకవేళ ప్రతి నెల 1389 రూపాయలను మూడు సంవత్సరాల పాటు చెల్లిస్తే 7 శాతం వడ్డీతో లక్ష రూపాయలను పొందవచ్చును.

MOST READ :

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు