Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsవైద్యంహైదరాబాద్

Gold Price : ఎవరెస్ట్ ఎక్కిన గోల్డ్.. లక్షకు చేరువయ్యేనా..!

Gold Price : ఎవరెస్ట్ ఎక్కిన గోల్డ్.. లక్షకు చేరువయ్యేనా..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ధర ఎవరెస్ట్ ఎక్కేసింది. భారీగా ధర పెరిగి రికార్డు కొట్టేసింది. రికార్డ్ స్థాయిలో తులం బంగారం చేరుకుంది. మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. అయితే తులం బంగారం లక్ష రూపాయలకు చేరువవుతుందా..? అని మహిళలు ఆందోళన చెందుతున్నారు.

శుక్రవారం ఒక్కరోజే 100 గ్రాముల బంగారంకు రూ. 6500 పెరిగింది. 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం గురువారం 7,39,000 ఉండగా శుక్రవారం 6వేల రూపాయలు పెరిగి 7,45,000 గా ఉంది. 24 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం 8,06,200 రూపాయలు ఉండగా శుక్రవారం 6,500 పెరిగి 8,12,700 రూపాయలకు చేరింది.

హైదరాబాదులో శుక్రవారం 10 గ్రాముల (తులం) బంగారం 22 క్యారెట్స్ 74,500 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 81,270 రూపాయలు ఉంది. హైదరాబాద్ నగరంలో ఉన్న బంగారం ధరలు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాలలో అవే కొనసాగుతున్నాయి.

|Similar News : 

  1. Gold Price : పసిడి ధర భారీగా షాక్.. సామాన్యులు కొనలేరా..!

  2. Gold Price : సంక్రాంతికి మహిళలకు షాక్.. మళ్లీ పెరిగిన గోల్డ్ ధర..!

  3. Gold Price : పసిడి ప్రియులకు షాక్. మళ్ళీ పెరిగిన ధర, అంత ధర ఉంటే కొంటారా..!

  4. Gold Price : పసిడి ధర మళ్లీ పై పైకి.. తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు