తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

District collector : మహిళా ఉద్యోగులు స్వేచ్ఛగా పనులను చేసుకునేలా పోష్ యాక్ట్-23.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!

District collector : మహిళా ఉద్యోగులు స్వేచ్ఛగా పనులను చేసుకునేలా పోష్ యాక్ట్-23.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!

సూర్యాపేట, మనసాక్షి :

జిల్లాలో పనిచేసే మహిళా ఉద్యోగులపై ఎలాంటి లైంగిక వేధింపులకు గురి అయిన వారు అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధ పరిష్కార చట్టంపై జిల్లా సమైక్య మహిళలకు మండల సమైక్య మహిళలకు ఎన్జీవోలకు మహిళా ఉద్యోగులకు మహిళా శిశు సంక్షేమ శాఖ లోని మహిళా సాధికారత కేంద్రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ మాట్లాడుతూ మహిళలు స్వేచ్ఛగా తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలన్నారు పదిమంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న ప్రభుత్వ ప్రైవేటు సంఘటిత అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న ఉన్నచోట మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు నిరోధించడానికి మహిళలు ధైర్యంగా వారి పనులు వారు చేసుకోవడానికి అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ప్రతి శాఖ అధికారి హోటల్స్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ నన్ను కూడా కమిటీలను ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

10 మంది కంటే తక్కువ ఉన్న ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థలలో చెందినవారు ఎలాంటి వేధింపులు జరిగిన జిల్లా స్థాయిలో ఉన్న స్థానిక ఫిర్యాదుల కమిటీ లో ఫిర్యాదు చేసుకొనవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శ్రీవాణి మాట్లాడుతూ మహిళ ఉద్యోగి నెల ఇష్టానికి వ్యతిరేకంగా ఉండే ఎటువంటి లైంగిక చర్య అయిన పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల కిందికి వస్తుందని సెక్రటరీ శ్రీవాణి తెలిపారు.

మహిళలు తమ ఫిర్యాదులను అంతర్గత ఫిర్యాదుల కమిటీ కి అందజేయాలని తెలిపారు వేధింపులకు గురైన మహిళల దరఖాస్తులను 90 రోజులలో ఐసి కమిటీ మెంబర్లు పరిష్కరించడం జరుగుతుందని సెక్రటరీ తెలిపారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండి (ప్రభుత ,ప్రైవేటు) అధికారి ద్వారా జరిగిన లైంగిక వేధింపులకు గురి అయిన ఎడల స్థానిక ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేసుకోవచ్చని ఆమె తెలిపారు.

ఫిర్యాదు చేసే మహిళల యొక్క ప్రతి విషయాన్ని గోపయ్యగా ఉంచబడతాయని ఆమె తెలిపారు సంఘటన జరిగిన వెంటనే ఫిర్యాదు చేయవచ్చని ఆమె పేర్కొన్నారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఈ యొక్క సభ్యుల బాధ్యతలను వివరించడం జరిగింది వేధింపులకు గురి అయిన మహిళ మూడు నెలల కాలం లోపు ఫిర్యాదు చేసుకోవాలని ఆమె తెలిపారు.

జిల్లాలో ఉన్న ఎన్జీవోలు అందరూ జిల్లా మహిళా సమైక్యలు కూడా మహిళా చట్టాలపై మహిళలందరికీ అవగాహన పరచాలని ఆమె తెలిపారు మహిళలకు వికలాంగులకు పిల్లలకు ఉచిత న్యాయ సేవలు అందించబడతాయని దానికి టోల్ ఫ్రీ నెంబర్ 15100 ఫోన్ చేయవచ్చని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు అమ్మాయిలు తెలియని వ్యక్తులతో అస్సలు మాట్లాడవద్దని సోషల్ మీడియా ఇంస్టాగ్రాము లలో వచ్చే ఫేక్ సమాచారాలకు సమాధానం ఇవ్వవద్దని ఆమె విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో డిడబ్ల్యుఓ నరసింహారావు, ఏసీడీపీఓ రూప, స్థానిక ఫిర్యాదుల కమిటీ చైర్మన్ శిరీష, సభ్యులు లత ,అనసూయ, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ చైతన్య నాయుడు ,జండర్ స్పెషలిస్టులు రేవతి, వినోద్, తేజస్విని, క్రాంతి, సఖి సిబ్బంది ,ఎన్జీవోలు, డిఎల్ఎస్ఎ సభ్యులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. February : ఫిబ్రవరి నెల.. భూమ్మీద ఉన్నవారికి ఇదే ఆఖరు.. స్పెషాలిటీ తెలిస్తే ఆశ్చర్యమే..!

  2. Ration Cards : లిస్టులో పేరు లేకుంటే మళ్ళీ దరఖాస్తుకు అవకాశం.. కొత్త రేషన్ కార్డుల పై లేటెస్ట్ అప్డేట్..!

  3. Gold Price : వీకెండ్ లో గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..!

  4. Govt Jobs : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్ష లేకుండా ఎంపిక..!

  5. Hyderabad : హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించారు.. ఎల్బీనగర్ టు ఖైరతాబాద్.. (వీడియో)

మరిన్ని వార్తలు