Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లారాజకీయం

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ..!

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ..!

దమ్మపేట, మనసాక్షి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట గ్రామ శివారులో ఆదివారం ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని మొద్దుల గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో అప్పారావుపేట గ్రామంలో తన పర్యటన ముగించుకొని తిరిగి వెళ్తున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రోడ్డు ప్రమాదాన్ని గుర్తించారు.

వెంటనే తన కారును ఆపిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుడిని తన కారులో దమ్మపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. వెంటనే ప్రాథమిక చికిత్స చేయించి, మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దమ్మపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అక్కడే ఉండి క్షతగాత్రుడికి ధైర్యం చెప్పారు. మానవత్వం చూపించిన ఎమ్మెల్యేని పలువురు అభినందిస్తున్నారు.

MOST READ : 

  1. Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!

  2. Jobs : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణలో కొలువుల జాతర..!

  3. Ration Cards : లిస్టులో పేరు లేకుంటే మళ్ళీ దరఖాస్తుకు అవకాశం.. కొత్త రేషన్ కార్డుల పై లేటెస్ట్ అప్డేట్..!

  4. February : ఫిబ్రవరి నెల.. భూమ్మీద ఉన్నవారికి ఇదే ఆఖరు.. స్పెషాలిటీ తెలిస్తే ఆశ్చర్యమే..!

  5. Govt Jobs : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్ష లేకుండా ఎంపిక..!

మరిన్ని వార్తలు