District collector : గ్రామసభల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక.. జిల్లా కలెక్టర్..!
District collector : గ్రామసభల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక.. జిల్లా కలెక్టర్..!
నల్లగొండ, మనసాక్షి :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు గ్రామ/ వార్డు సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసే కార్యక్రమం మంగళవారం ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ పథకాలకు లబ్దిదారుల ఎంపికకు ఉద్దేశించి ప్రారంభమైన గ్రామసభలలో భాగంగా, మంగళవారం ఆమె నల్గొండ మున్సిపల్ పరిధిలోని ఒకటవ వార్డు (పానగల్లు)లో నిర్వహించిన వార్డు సభకు హాజరయ్యారు. వార్డు సభ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించడమే కాకుండా ఆయా పథకాల కింద లబ్ధిదారులనుండి నూతన దరఖాస్తులను స్వీకరించారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత వారం క్రితం నుండి ఆయా పథకాల కింద లబ్ధిదారుల ఎంపికకు నిర్వహించిన సర్వేలో అర్హత ఉన్న వారి పేర్లను జిల్లా వ్యాప్తంగా గ్రామ,వార్డు సభల్లో చదివి వినిపిస్తున్నట్లు తెలిపారు. గ్రామసభలలో ఆయా జాబితాలపై ఏవైనా అభ్యంతరాలు వచ్చినట్లయితే నమోదు చేస్తున్నామన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద జాబితాలో పేర్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం నిర్వహిస్తున్న గ్రామసభలలో తిరిగి ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ వెల్లడించారు.
అలాగే గ్రామసభలలో దరఖాస్తులు సమర్పించలేకపోయిన వారు ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన మీ-సేవ కేంద్రాలలో దరఖాస్తులు సమర్పించవచ్చని చెప్పారు. గతంలో దరఖాస్తులు ఇచ్చి, జాబితాలో పేర్లు రానివారు ఇప్పుడు దరఖాస్తులు ఇవ్వవచ్చని ఆమె స్పష్టం చేశారు. ఆయా పథకాల కింద అర్హులు తప్పిపోకుండా అర్హత ఉన్న ప్రతి లబ్దిదారునికి లబ్ది కలిగించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.
ఆయా పథకాలకు నూతనంగా సమర్పించే దరఖాస్తులను పకడ్బందీగా రిజిస్టర్లో నమోదు చేస్తున్నామని అన్నారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా ,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అందువల్ల ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె పునరుద్ఘాటించారు.
ఆయా పథకాలకు సంబంధించి ప్రజలకు ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే సంబంధిత ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్లను సంప్రదించవచ్చని తెలిపారు. గ్రామసభలో ఆమోదం పొందిన జాబితాలను ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ సైతం చేయిస్తున్నామని కలెక్టర్ చెప్పారు.
నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా కు కొత్తగా దరఖాస్తుల ఆహ్వానం.. బిగ్ అప్డేట్..!
-
Miryalaguda : రేషన్ కార్డు కోసం ప్రభుత్వ ఉద్యోగుల ధరఖాస్తు.. డబుల్ దరఖాస్తులతో అధికారులకు తలనొప్పి..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు మరో అవకాశం.. ఇవి తప్పనిసరి ఉండాలి.. లేటెస్ట్ అప్డేట్..!
-
SBI : SBI సేవింగ్ అకౌంట్ లో రూ.236 కట్ అవుతున్నాయా.. ఖాతాదారుల గందరగోళం.. ఎందుకంటే..!
-
Banana : ఒక్క అరటిపండు రూ.100.. ఎక్కడో తెలిస్తే మీరు షాక్ కావాల్సిందే..!









