Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా కు కొత్తగా దరఖాస్తుల ఆహ్వానం.. బిగ్ అప్డేట్..! 

Rythu Bharosa : రైతు భరోసా కు కొత్తగా దరఖాస్తుల ఆహ్వానం.. బిగ్ అప్డేట్..! 

మన సాక్షి, నల్గొండ బ్యూరో :

రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలియజేసింది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు రైతు భరోసా కు అర్హులని పేర్కొన్నది. అందుకుగాను కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు రైతు భరోసా కు దరఖాస్తు చేసుకోవాలని నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు.

2025 జనవరి 31వ తేదీ వరకు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు రైతు భరోసా కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తుదారులు పట్టాదార్ పాస్ పుస్తకం తోపాటు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా బుక్ జిరాక్స్ లను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలని ఆయన పేర్కొన్నారు.

అంతే కాకుండా గతంలో రైతు భరోసా కు దరఖాస్తు చేసుకొని పొందుతున్న వారు కూడా బ్యాంకు ఖాతాను మార్పులు చేసుకోవాల్సి ఉంటే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

MOST READ : 

  1. Miryalaguda : రేషన్ కార్డు కోసం ప్రభుత్వ ఉద్యోగుల ధరఖాస్తు.. డబుల్ దరఖాస్తులతో అధికారులకు తలనొప్పి..!

  2. Ration Cards : కొత్త రేషన్ కార్డులకు మరో అవకాశం.. ఇవి తప్పనిసరి ఉండాలి.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Banana : ఒక్క అరటిపండు రూ.100.. ఎక్కడో తెలిస్తే మీరు షాక్ కావాల్సిందే..!

  4. TG News : వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. జాబితా రెడీ.. లేటెస్ట్ అప్డేట్..!

  5. Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)

మరిన్ని వార్తలు