Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsవ్యవసాయంసంక్షేమంహైదరాబాద్

TG News : వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. జాబితా రెడీ.. లేటెస్ట్ అప్డేట్..!

TG News : వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. జాబితా రెడీ.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రైతు కూలీల కోసం రేవంత్ సర్కార్ కొత్త పథకాన్ని అమలు చేయబోతోంది. జనవరి 26వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. భూమి లేని రైతు కూలీలకు ఏటా 12 వేల రూపాయలను రెండు విడతలుగా వారి వారి ఖాతాలలో జమ చేయనున్నారు. భూమిలేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో ప్రభుత్వం వారికి భరోసా కల్పించనున్నది.

అయితే ఈనెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అధికారులు క్షేత్రస్థాయిలో భూమిలేని రైతు కూలీల విషయంపై సర్వే నిర్వహించారు. జాబితాలు కూడా సిద్ధం అయ్యాయి. కాగా ఈనెల 21వ తేదీ నుంచి 24 వ తేదీల వరకు గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి జాబితాలను వెల్లడించనున్నారు. గ్రామ సభలో నిర్ణయించిన మేరకు వారికి ఒక విడత 6000 రూపాయలను వారి ఖాతాలలో ప్రభుత్వం జమ చేయనున్నది.

ఎంపిక చేయబడింది ఇలా..!

భూమిలేని రైతు కూలీల ఎంపికను ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు అప్పగించింది. దాంతో వారు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉండి కనీసం 20 రోజుల పని దినాలకు వెళ్లి ఉన్నట్లయితే వారిని ఎంపిక చేశారు. అలాంటి వారిలో భూమిలేని కూలీలను గుర్తించి జాబితాను సిద్ధం చేశారు.

పది లక్షల మంది లబ్ధిదారులు :

ఉపాధి హామీ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1.10 కోట్ల మంది కూలీలు ఉన్నారు. వారిలో 29 లక్షల మంది జాబ్ కార్డుదారులకు ఎలాంటి భూమి లేదని అధికారులు గుర్తించారు. అందులోనూ చాలా కుటుంబాలు ఏడాదిలో ఒక రోజు నుంచి పది రోజులు మాత్రమే పని చేసినట్లుగా కూడా గుర్తించారు.

కనీసం 20 రోజుల పని దినాలు ఉండాలనే నిబంధన అమలు చేయాల్సి ఉండగా 20 రోజుల ప్రామాణికంతో రాష్ట్రంలో పది లక్షల కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి ప్రతి ఏటా రెండు విడతలుగా 12000 రూపాయలను వారి ఖాతాలలో జమ చేయనున్నారు.

| MOST READ : 

  1. Gold Price : బంగారం ధర ఎంతో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!

  3. Banana : ఒక్క అరటిపండు రూ.100.. ఎక్కడో తెలిస్తే మీరు షాక్ కావాల్సిందే..!

  4. TG News : మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి రూ.12 వేలు..!

  5. Jobs : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణలో కొలువుల జాతర..!

మరిన్ని వార్తలు