Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

SBI : SBI సేవింగ్ అకౌంట్ లో రూ.236 కట్ అవుతున్నాయా.. ఖాతాదారుల గందరగోళం.. ఎందుకంటే..!

SBI : SBI సేవింగ్ అకౌంట్ లో రూ.236 కట్ అవుతున్నాయా.. ఖాతాదారుల గందరగోళం.. ఎందుకంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవింగ్ అకౌంట్ ఉన్నవారికి ఎకౌంటు నుంచి డబ్బులు కట్ అవుతాయి. ఖాతాదారులు గందరగోళమైన పరిస్థితి నెలకొంటారు. ఎందుకు కట్ అవుతున్నాయో..? ఏంటో..? తెలియక తలలు పట్టుకుంటున్నారు. 236 రూపాయలు కట్ అయ్యయని బ్యాంకు లింకు ఉన్న ఫోన్ నెంబర్ కు మెసేజ్ రాగానే కస్టమర్లు తలలు పట్టుకుంటున్నారు.

అయితే సేవింగ్ ఖాతాల నుండి డబ్బులు కట్ కావడానికి కారణం ఏంటనే విషయాన్ని బ్యాంకు అధికారులు వెల్లడించారు. అదేమిటో చూద్దాం. SBI కి సుమారుగా 50 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకులో ఒకటైన ఎస్బిఐ వినియోగదారులకు అనేక రకాల డెబిట్ కార్డులు (ATM) అందిస్తుంది.

వాటిలో సిల్వర్/ క్లాసిక్/ గ్లోబల్/ కాంటాక్ట్ లెస్ కార్డులు ఇలా రకరకాల కార్డులను జారీ చేస్తుంది. ఇదిలా ఉండగా ఎస్బిఐ తమ కార్డుదారులకు మెరుగైన సేవలు అందించేందుకు గాను ఇయర్ మెయింటెనెన్స్ చార్జి వసూలు చేస్తుంది.

ఏటీఎం కార్డు రకాన్ని బట్టి బ్యాంకు వార్షిక రుసుమును వసూలు చేస్తుంది. మినిమం 200 రూపాయలకు పైగానే కార్డు చార్జి చేస్తుంది. దానికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. 18% జిఎస్టి తో పాటు 200 రూపాయలు.. అంటే 236 రూపాయలు కట్ చేస్తుంది.

అది కాకుండా గోల్డ్ / కాంబో/ మై కార్డు వంటి ఏటీఎం కార్డులు ఉన్న వారికి 250 రూపాయలు తో పాటు జీఎస్టీ కట్ అవుతుంది. ప్లాటినం డెబిట్ కార్డు ఉన్నవారికి 325 రూపాయలతో పాటు జీఎస్టీ కట్ అవుతుంది. బిజినెస్ డెబిట్ కార్డులు ఉంటే 350 రూపాయలతో పాటు జీఎస్టీ కట్ చేస్తోంది.

బ్యాంక్ స్టేట్మెంట్ కానీ మొబైల్ నెంబర్లకు వచ్చే మెసేజ్ కానీ పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇవి కాకుండా అదనంగా డబ్బులు కట్ అయితే నేరుగా బ్యాంకు కి వెళ్లి అధికారులను సంప్రదించాలని అధికారులు పేర్కొంటున్నారు.

MOST READ : 

  1. Banana : ఒక్క అరటిపండు రూ.100.. ఎక్కడో తెలిస్తే మీరు షాక్ కావాల్సిందే..!

  2. Gold Price : బంగారం ధర ఎంతో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)

  4. Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!

  5. Ration Cards : లిస్టులో పేరు లేకుంటే మళ్ళీ దరఖాస్తుకు అవకాశం.. కొత్త రేషన్ కార్డుల పై లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు