District collector : పరీక్ష వ్రాసే విధానాన్ని విద్యార్థులకు తెలపాలి.. కలెక్టర్ ఆదేశం..!
District collector : పరీక్ష వ్రాసే విధానాన్ని విద్యార్థులకు తెలపాలి.. కలెక్టర్ ఆదేశం..!
చివ్వెంల, (మన సాక్షి) :
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో ని బండమీది చందుపట్ల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో స్టాఫ్ రూమును పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదులను సందర్శించారు. పదవ తరగతి గదిలో జరుగుతున్న తెలుగు క్లాస్ ని సందర్శించి విద్యార్థులతో అనంతరం విద్యార్థులు రాసిన నోట్ పుస్తకాలను వారి చేతిరాతను పరిశీలించి పరీక్షలలో హ్యాండ్ రైటింగ్ మంచిగా వ్రాసేలా చూసుకోవాలని సూచించారు.
పదవ తరగతి వార్షిక పరీక్షలకు సమయం దగ్గర పడుతున్నందున కస్టపడి చదవాలని మంచి మార్కులు తెచ్చుకొవాలని సూచించారు. పరీక్ష వ్రాసే విధానాన్ని విద్యార్థిని విద్యార్థులకు తెలపాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు జరగకపోవటం పై ప్రధాన ఉపాధ్యాయుడు బి శ్రీనివాస్, సంబంధిత ఇంజనీరింగ్ అధికారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారం రోజులలో పనులు పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం స్టోర్ రూమ్, మెను రిజిస్టర్, హజరు పట్టికను పరిశీలించారు, పిల్లల కొరకు తయారుచేసిన మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తు విద్యార్థులతో ముచ్చటించారు. సోమ, బుధ, శుక్రవారం లలో గుడ్లు పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు విద్యా బోధనలో అసౌకర్యాలు కల్పించిన, మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోయినా సహించేది లేదన్నారు. సుమారు గంటన్నరసేపు విద్యార్థులతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ, వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ విద్యార్థులను ఉత్సాహపరిచారు.
అనంతరం ఉపాధ్యాయ సిబ్బంది తో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలలో నూరు శాతం ఉత్తీర్ణత సాదించాలని అందుకొరకు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.
విద్యార్థులు ఏదైనా సబ్జెక్ట్ లో వెనుకబడి ఉంటే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఆయన వెంట తహసీల్దార్ కృష్ణయ్య, ప్రధాన ఉపాధ్యాయులు బి శ్రీనివాస్, ఉపాధ్యాయని ఉపాధ్యాయులు, స్థానికులు గుద్దేటి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Khammam : నాన్నతో కలిసి శిలపలు తొక్కేది.. మహిళా కూలీలతో మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు..!
-
Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తులకు ఇదే చివరి తేదీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Nalgonda : పద్ధతి మార్చుకోకుంటే తగిన బుద్ధి చెప్తాం.. మాజీ ఎమ్మెల్యే కి హెచ్చరిక..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు మరో అవకాశం.. ఇవి తప్పనిసరి ఉండాలి.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : పసిడి ప్రియులకు భారీ షాక్.. హైదరాబాదులో తులం ఎంతంటే..!









