Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలు

Khammam : అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు.. నగర మేయర్..!

Khammam : అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు.. నగర మేయర్..!

ఖమ్మం బ్యూరో, మన సాక్షి:

ఖమ్మం నగరంలోని 3 టౌన్ ప్రాంతంలో నిర్వహించిన 46వ డివిజన్ గ్రామ సభ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఇతర పార్టీ ల నాయకులు మరియు అధికారులు పాల్గొన్న సభ ఎక్కడా చిన్న అవాంఛనీయ సంఘటన జరుగకుండా ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన నగర కార్పొరేషన్ మేయర్ పునుకోళ్లు నీరజ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గ్రామసభల్లో భాగంగా ఖమ్మం నగరంలో గురువారం 46వ డివిజన్లో జరుగుతున్న గ్రామసభ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు.

మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడికి విచ్చేసిన ఆడపడుచులు అందరూ ఒక పండుగకు విచ్చేసిన అక్కచెల్లెళ్ల లా అన్నదమ్ములు ల మాదిరిగా ఎక్కడ పొరపొచ్చాలు లేకుండా గ్రామ సభ ఆద్యంతం ఆహ్లాదకరంగా జరుగుతుంటే చాలా ముచ్చటగా ఉందని ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం మీ డివిజన్లో ఉన్న అర్హులైన వారిని మీరే గుర్తించాలి.

ఎందుకంటే అసలైన పేదలు లబ్ధిదారులు ఎవరో మాకంటే మీకే ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి ,మీ డివిజన్ అర్హులను మీరే గుర్తించాలని చెప్పి ప్రజల మధ్యనే గ్రామ సభలు పెట్టి అర్హులను గుర్తించే పనిని ప్రభుత్వం చేపట్టిందని ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందే విధంగా కృషి చేస్తా మని ప్రజలు సహకరించాలని కోరారు.

MOST READ : 

మరిన్ని వార్తలు