District Collector : జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. యూరియా బ్లాక్ లో అమ్మితే లైసెన్సులు రద్దు..!
District Collector : జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. యూరియా బ్లాక్ లో అమ్మితే లైసెన్సులు రద్దు..!
కనగల్, మన సాక్షి:
నల్గొండ జిల్లాలో ఫర్టిలైజర్ షాపుల దుకాణాల యజమానులు యూరియాకు కృత్రిమ కోరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జిల్లా త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరైనా ఫర్టిలైజర్ దుకాణదారులు యూరియాను బ్లాక్ లో విక్రయించినట్లయితే ఆ షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు .రైతులు సాగు చేస్తున్న భూముల వివరాల ఆధారంగా ఏ పంటకు ఎంత యూరియా అవసరమో అంతమేరకు సరఫరా చేయాలని చెప్పారు.
యూరియా సరఫరా విషయంలో వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు గట్టి నిఘా ఉంచాలని, ఫర్టిలైజర్ దుకాణాలను తరచు తనిఖీ చేయాలని ఆమె ఆదేశించారు. ఫర్టిలైజర్ దుకాణాదారులు వారి వద్ద ఉన్న యూరియా నిల్వలను ఎప్పటికప్పుడు ప్రదర్శించే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడైనా యూరియాకు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎక్కడైనా యూరియాకు సమస్యలు ఉన్నట్లు తెలిస్తే జిల్లా వ్యవసాయ అధికారి లేదా ఆయా మండలాల వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె రైతులకు సూచించారు. నల్గొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరతలేదని, అవసరమైనమేర యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ కనగల్ మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణంలో యూరియా నిల్వలను, సరఫరా వివరాలను కంప్యూటర్ ద్వారా ఆన్లైన్లో పరిశీలించారు.
MOST READ :
-
Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా పడిపోయిన గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!
-
Scam Alert : మల్టీ లెవెల్ మార్కెటింగ్ గేటుగాళ్ల కొత్త ట్రిక్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు.. చెక్ చేసుకోండి.. బిగ్ అప్డేట్..!
-
Rythu Bharosa : రైతు భరోసా.. వారు అలా.. వీరు ఇలా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu : యూరియా కోసం రైతుల కష్టాలు.. క్యూ లైన్ లో చెప్పులు పెట్టిన రైతులు..!









