హైదరాబాద్Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణ

Hyderabad : ఎక్స్ పీరియం పార్కును చూసి సీఎం రేవంత్ రెడ్డి, నేను ఆశ్చర్యపోయా.. చిరంజీవి

Hyderabad : ఎక్స్ పీరియం పార్కును చూసి సీఎం రేవంత్ రెడ్డి, నేను ఆశ్చర్యపోయా.. చిరంజీవి

శంకర్‌పల్లి, (మన సాక్షి):

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామ శివారులో ప్రపంచ స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్సపీరియం పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పార్క్ రూపకర్త, చైర్మన్ రామడుగు రాందేవ్ రావ్, కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి, రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఎక్స్ పీరియం పార్కును చూసి సీఎం రేవంత్ రెడ్డి, నేను ఆశ్చర్యపోయానని అన్నారు. ఈ పార్కును షూటింగ్స్ కి ఇస్తారా అని ఛైర్మన్ ను అడిగితే మొదటి షూటింగ్ మీదైతే ఇస్తానని అన్నారని, ఈ ఎండలో హీరోయిన్ తో డాన్స్ అంటే కష్టమన్నారు. వచ్చే శీతాకాలంలో ట్రై చేస్తానంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.

చైర్మన్ రాందేవ్ రావ్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 150 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేశామన్నారు. ఈ పార్కులో అర్జెంటీనా, ఉరుగ్వే, మెక్సికో, సౌత్ అమెరికా, స్పెయిన్, ఇటలీ, న్యూగినియా, ఆస్ట్రేలియా, థాయి లాండ్, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల నుంచి అరుదైన 25వేల మొక్కలు, చెట్లు, రకరకాల స్టోన్స్, అందమైన శిలను సేకరించి గార్డెన్ ఏర్పాటు చేశామన్నారు. దీని కోసం సుమారు రూ. 150 కోట్లు ఖర్చు అయిందని చెప్పారు.

అందమైన ఒక్కో శిల్పానికి 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు అయిందన్నారు. 1500 మంది కూర్చునేలా ఇండియాలోని అతిపెద్ద హంపి థియేటర్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలో 30 అడుగుల ఎత్తులో నిర్వహిస్తే శిల్పాలు ఏర్పాటు చేసి వాటిని ఎంతో ఆకర్షణీయంగా రూపు దిద్దుకుందని పేర్కొన్నారు. రూ.50 కోట్లతో 12 ఎకరాల్లో మ్యాన్ నైట్ బీచ్ ఏర్పాటు చేశామన్నారు.

40 గదులు, 20 కాటేజీలతో కూడిన ఉత్కంఠ భరితమైన సహజ రిసార్ట్ ద్వీపంగా తీర్చిదిద్దామన్నారు. ఫ్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, ఫోటోషూట్లకు ఎక్స్పీరియన్ లో ఎంతో శ్రమకోర్చి తీర్చిదిద్దినట్లు తెలిపారు. దేశానికి గర్వకారణంగా రాష్ట ప్రతిష్ఠకు చిన్నంగా హైదరాబాద్‌కు ఒక ఐకానిక్ పార్క్ గా మిగిలిపోనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పార్క్ బ్రోచర్‌ను సీఎం, చిరంజీవి, మంత్రి, ఎమ్మెల్యేలు కలిసి విడుదల చేశారు. ఖమ్మం జిల్లా రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, కోటి మొక్కల వనజీవి రామయ్య దంపతులను సీఎం, పార్క్ చైర్మన్ ఘనంగా సన్మానించి, చెక్కును అందజేశారు.

కార్యక్రమంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సీఎం రమేష్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, రాజేంద్రనగర్ డిసిపి శ్రీనివాస్, ఏసీపీలు వెంకటరమణ గౌడ్, బాలాజీ, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ఆర్డిఓ చంద్రకళ, తహసిల్దార్ సురేందర్, ఎంపీడీవో వెంకయ్య గౌడ్, కమిషనర్ శ్రీనివాస్,

ఎంఈఓ అక్బర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అనిత రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్, మాజీ వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొల్లారం ప్రశాంత్ రెడ్డి, సినీ రచయిత విజయేంద్రప్రసాద్, హీరో కమల్ కామరాజు, యాంకర్ సుమ, సినీ నటుడు రాజారవీంద్ర, బిగ్ బాస్ సోనీ ఆకుల, సిఐలు, ఎస్ఐలు, నియోజకవర్గంలోని ఐదు మండలాల కాంగ్రెస్, బిజెపి నాయకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ :

  1. District Collector : నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం.. భూసేకరణ యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ.. జిల్లా కలెక్టర్..!

  2. ACB : ఫోన్ పే ద్వారా లంచం.. ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ సురేష్..!

  3. Karnataka to telangana : కర్ణాటక నుంచి తెలంగాణకు నల్ల బెల్లం రవాణా.. భారీగా పట్టివేత..!

  4. District Collector : జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. యూరియా బ్లాక్ లో అమ్మితే లైసెన్సులు రద్దు..!

  5. Nalgonda : గులాబీ మయమైన నల్గొండ..!

మరిన్ని వార్తలు