Nalgonda : గులాబీ మయమైన నల్గొండ..!
Nalgonda : గులాబీ మయమైన నల్గొండ..!
మన సాక్షి, నల్గొండ బ్యూరో :
నల్లగొండ పట్టణం గులాబీమయం అయ్యింది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో నిర్వహించే రైతు మహా ధర్నాకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు, రైతులు భారీగా తరలివచ్చారు. గులాబీ జెండాలతో, తోరణాలతో జిల్లా కేంద్రమైన నల్లగొండ మొత్తం గులాబీ మయంగా మారింది. రైతు మహా ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయనకు ఆ పార్టీ నేతలు ఎన్జీ కళాశాల సెంటర్ వద్ద స్వాగతం పలికారు. అక్కడి నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీగా బయలుదేరిన కేటీఆర్ క్లాక్ టవర్ సెంటర్లో రైతు మహా ధర్నాలో పాల్గొన్నారు. ర్యాలీ లో కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రైతు మహాధర్నాలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా.. వారు అలా.. వీరు ఇలా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu : యూరియా కోసం రైతుల కష్టాలు.. క్యూ లైన్ లో చెప్పులు పెట్టిన రైతులు..!
-
Railway Recruitment : ఇండియన్ రైల్వేస్ లో కొలువుల జాతర.. వేతనం రూ.35000.. వెంటనే దరఖాస్తు చేయండి..!
-
Suryapet : సూర్యాపేటలో యువకుడి దారుణ హత్య..!
-
Miryalaguda : ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. లక్షల్లో వసూలు.. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్..!
-
Scam Alert : మల్టీ లెవెల్ మార్కెటింగ్ గేటుగాళ్ల కొత్త ట్రిక్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!









