Good News : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. రూ.5లక్షలు పొందే పథకం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

Good News : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. రూ.5లక్షలు పొందే పథకం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలియజేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా రైతులకు శుభవార్త అందింది. రైతులకు వ్యవసాయ అవసరాలకు గాను ఆర్థిక సహాయాన్ని ప్రోత్సహించేందుకు గ్రామీణాభివృద్ధికి కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) పరిమితిని పెంచింది. ప్రస్తుతం 3 లక్షల రూపాయల వరకు ఉన్న పరిమితిని ఐదు లక్షల రూపాయల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడి రైతులకు ఉపయోగకరంగా ఉండనున్నది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల రైతులు తమ వ్యవసాయ అవసరాలకు గాను మరిన్ని నిధులను పొందవచ్చును. రైతులు కిసాన్ క్రెడిట్ ద్వారా రుణాన్ని సులభంగా తీసుకోవచ్చును. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనల ప్రకారం మూడు లక్షల రూపాయల వరకు కిసాన్ క్రెడిట్ ద్వారా రుణాలకు ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, తనిఖీ, ఇతర సేవా చార్జీలను వసూలు చేయవద్దని ఆదేశించింది. దీని ద్వారా సన్న,చిన్నకారు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉండనున్నది.
కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు తీసుకుంటే మొదటి దఫా 7 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఆ తర్వాత దానికి 4 శాతం వర్తిస్తుంది అంటే పావలా వడ్డీ వర్తిస్తుంది. రాయితీని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డు కూడా ఏటీఎం కార్డు మాదిరిగానే ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకుని సౌలభ్యం ఉంటుంది. బడ్జెట్ లో పరిమితిని పెంచడంతో ఎక్కువ మంది రైతులకు ఈ కార్డులు పొందే అవకాశం ఉంది. డిజిటల్ భూ రికార్డులు ఉంటే కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు పొందే అవకాశం ఉంది. దరఖాస్తులకు డిజిటల్ సంతకం చేసిన ఆన్‌లైన్ భూమి రికార్డులు చెల్లుబాటు అవుతాయి.
కార్డు కోసం దరఖాస్తు ఎలా..?
కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు బ్యాంకు వెబ్ సైట్ ను సందర్శించాలి.
బ్యాంక్ వెబ్ సైట్ లో ఎంపికల జాబితాలో కిసాన్ క్రెడిట్ కార్డును ఎంపిక చేసుకోవాలి.
అప్లై ఎంపికపై క్లిక్ చేయాలి.
మీకు కావాల్సిన అప్లికేషన్ పేజీ ఓపెన్ చేయాలి.
దానిలో అవసరమైన వివరాలతో ఫారం ను పూర్తిచేయాలి.
ఆ తర్వాత సబ్మిట్ బటన్ నొక్కాలి.
సబ్మిట్ అయిన తర్వాత అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది.
మీకు అర్హత కలిగి ఉంటే తదుపరి ప్రక్రియను కోసం మూడు, నాలుగు రోజుల్లో బ్యాంకు సిబ్బంది మిమ్మల్ని సంప్రదిస్తారు.
MOST READ :
-
TG News : కుల గణన సర్వే రిపోర్ట్.. బీసీ జనాభా లెక్క తేలింది.. అధికారికంగా ప్రకటించిన కమిటీ..!
-
Penpahad : కల్తీ విత్తనాలతో భారీగా నష్టం.. వ్యవసాయ అధికారులకు రైతు ఫిర్యాదు..!
-
Budget 2025 : కేంద్ర బడ్జెట్ తో ధరలు తగ్గేవి.. పెరిగే వస్తువులు ఇవే.. తెలుసుకోండి..!
-
ఆ గ్రామంలో సంపూర్ణ మధ్య నిషేధం.. అమ్మితే రూ. 50 వేలు జరిమానా.. ఏకగ్రీవ నిర్ణయం..!
-
Miryalaguda : నల్గొండ జిల్లాలో ఫేక్ రిపోర్టర్ల గుట్టు రట్టు.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు.. పిడి యాక్ట్ నమోదు..!









