Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో పడలేదా.. అయితే ఇలా చేయండి..!

Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో పడలేదా.. అయితే ఇలా చేయండి..!
మన సాక్షి, తెలంగాణ బ్యూ రో :
తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. రైతులకు పంట పెట్టుబడి సహాయం కోసం ఎకరానికి 12,000 రూపాయలను రెండు విడతలుగా అందజేయనున్నారు. ఒక విడుత 6000 రూపాయలను ప్రస్తుతం ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేస్తుంది.
26వ తేదీన ప్రారంభమైన రైతు భరోసా పథకం రాష్ట్రంలోని మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి నిధులు విడుదల చేశారు. ప్రభుత్వం 4.42 లక్షల మంది రైతులకు 593 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
వారికి 27వ తేదీన రైతుల ఖాతాలలో నిధులు జమయ్యాయి. తిరిగి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఫిబ్రవరి 5వ తేదీ నుంచి పంట పెట్టుబడి సహాయం రైతుల ఖాతాలలో జమ అవుతుంది. 17.03 లక్షల మంది రైతులకు 533 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
ఫిబ్రవరి 5వ తేదీన నుంచి రైతులకు పంట పెట్టుబడి సహాయంగా రైతు భరోసా పథకం ద్వారా ఎకరం లోపు ఉన్న రైతులకు వారి వారి ఖాతాలలో జామ అవుతున్నాయి. కాగా కొంతమంది రైతులకు ఖాతాలలో డబ్బులు జమ కాలేదని ఆందోళన చెందుతున్నారు.
అయితే డబ్బులు జమకాని రైతులు సంబంధిత ఎఈఓ లకు తెలియజేస్తే వారు సాంకేతిక కారణాలు ఏమైనా ఉంటే పరిశీలించి ఆన్ లైన్ లో పొందుపరచనున్నారు. ఆ తర్వాత అర్హులైన వారందరికీ రైతుల ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి.
కొత్త దరఖాస్తులకు అందని భరోసా :
కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన రైతులకు రైతు భరోసా పథకం అందలేదు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులకు కూడా రైతు భరోసా అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జనవరి 24వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
వ్యవసాయ అధికారులు వారి పేర్లను ఆన్ లైన్ లో నమోదు చేశారు. అయినా కూడా వారికి ఇంకా భరోసా బ్యాంకు ఖాతాలలో జమ కాలేదు. ఈ విషయాన్ని వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా రైతు భరోసా నిధులు కొత్తవారికి కూడా వస్తాయని చెబుతున్నారు.
MOST READ :
-
Seeds : నకిలీ విత్తనాలతో నిండా మునిగిన రైతులు.. వరి పొలాలు సందర్శించిన కోదండరెడ్డి..!
-
Miryalaguda : మోడల్ స్కూల్ హాస్టల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఇఓ.. కీలక ఆదేశాలు..!
-
Gold Price : బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు.. స్వచ్ఛత ఎలా.. అందరూ తెలుసుకోవాల్సిందే..!
-
Rythu Bharosa : రైతు భరోసా.. 17.03 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.533 కోట్లు జమ.. చెక్ చేసుకోండి..!
-
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ.. ముందుగా వారికే.. బిగ్ అప్డేట్..!









