Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : మోడల్ స్కూల్ హాస్టల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఇఓ.. కీలక ఆదేశాలు..!

Miryalaguda : మోడల్ స్కూల్ హాస్టల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఇఓ.. కీలక ఆదేశాలు..!

వేములపల్లి, మన సాక్షి :

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తూ ఉత్తమ ఫలితాలు సాదించేందుకు కృషి చేయాలని డిఇఓ బి బిక్షపతి అన్నారు. గురువారం నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం లో వేములపల్లి మండలం కేంద్రంలోని మోడల్ స్కూల్, హాస్టల్ ను ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

అనంతరం ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ 10వ తరగతి,ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గర పడుతున్నందున విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు.

ఆరుగురు విద్యార్థులకు ఒక టీచర్ ను కేటాయించి ప్రిపరేషన్ చేయాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలన్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని ,ఆహార విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీరి వెంట ఎంఈఓ భూక్యా లక్ష్మణ్ నాయక్, మోడల్ స్కూల్ సిబ్బంది ఉన్నారు.

MOST READ : 

  1. Gold Price : బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు.. స్వచ్ఛత ఎలా.. అందరూ తెలుసుకోవాల్సిందే..!

  2. CLP : సీఎల్పీ సమావేశంలో సంచలనం.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రేవంత్ రెడ్డి ఆదేశాలు..!

  3. Rythu Bharosa : రైతు భరోసా.. 17.03 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.533 కోట్లు జమ.. చెక్ చేసుకోండి..!

  4. District collector : పెద్దగట్టు జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

మరిన్ని వార్తలు